విజయవాడ : ఆంధ్రరత్న భవన్లో అంబేద్కర్కి కాంగ్రెస్పార్టీ నేతలు ఘన
నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏపిసిసి అధ్య క్షుడు గిడుగు రుద్రరాజు
మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్
బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. సమాజంలో స్త్రీలకు ప్రాధాన్యత ఉండాలి.
స్త్రీలకు సమాన హక్కులు ఉండాలని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.
రాజ్యాంగంలో సర్వ మానవ సమానత్వం ఉండే విధంగా అన్ని వర్గాల ప్రజలకు
ఇచ్చినటువంటి వ్యక్తి, అణగారిన వర్గాల యొక్క గుండె చప్పుడుగా వాళ్లకున్నటువంటి
ఏవైతే హక్కులు కావాలో వాటిని కూడా పేద ప్రజలందరికీ అందించిన గొప్ప వ్యక్తి
అంబేద్కర్ అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఇటువంటి గొప్ప వ్యక్తిని చూడలేదని,
ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని వర్గాలు కలిసి పనిచేయడం
కోసం విశేషమైన కృషి చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా
అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో
సుంకర పద్మశ్రీ, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరి శెట్టి నరసింహారావు తదితరులు
పాల్గొన్నారు.