నిర్మల్ : స్వేచ్ఛ, సమానత్వాన్ని జీవిత సూత్రాలుగా అంటరానితనానికి
వ్యతిరేకంగా అంబేడ్కర్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని
అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని
మినీ ట్యాంక్ వద్ద రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి మంత్రి ఇంద్రకరణ్
రెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్ బీఆర్
అంబేద్కర్ అందరివాడని, కుల, మత రహిత ఆధునిక భారత దేశం కోసం అంబేద్కర్ తన
జీవితకాలం పోరాటం చేశారన్నారు. దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు
అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిదని తెలిపారు. ఆయన ఖ్యాతిని గుర్తించిన
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఏప్రిల్ 14న
ఆవిష్కరించనుందని, ఇది దేశంలోని అతి ఎత్తైన స్మారక చిహ్నంగా నిలవనుందని
పేర్కొన్నారు.