న్యూ ఢిల్లీ : దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో అత్యంత సంపన్నుడుగా
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలిచారు. భారత దేశంలో ప్రస్తుతం
ఉన్న 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులే. వీరిలో ఆంధ్రప్రదేశ్ సీఎం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూ.510కోట్లు విలువైన ఆస్తులతో అత్యంత సంపన్నుడిగా
నిలిచారు. ఆస్తుల విషయంలో బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చిట్టచివరన
ఉన్నారు. ఆమె పేరిట కేవలం 15 లక్షల రూపాయలు విలువైన ఆస్తులు ఉన్నాయి.
అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్- ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్
వాచ్(ఎన్ఈడబ్ల్యూ) అనే సంస్థలు ఈమేరకు ఓ నివేదిక విడుదల చేశాయి. రాష్ట్రాలు,
కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్లను
విశ్లేషించి ఈ నివేదిక రూపొందించినట్లు ఆయా సంస్థలు తెలిపాయి.