జగన్ మోహన్ రెడ్డి
విజయవాడ : పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇఫ్తార్
విందు ఈ ఏడాది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో జరగనున్నది ఆ ఇఫ్తార్ విందు
జరుగు ప్రదేశమైన విద్యాధరపురం లేబర్ కాలనీ స్టేడియం గ్రౌండ్ ను, రాష్ట్ర ఉప
ముఖ్యమంత్రి అంజాద్ భాషా, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, జిల్లా
కలెక్టర్ ఢిల్లీరావు, నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా, మునిసిపల్
కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుంద్కర్ లతో కలిసి క్షేత్ర స్థాయిలో
పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అంజాద్ భాష వెలంపల్లి మాట్లాడుతూ ఈ నెల 17వ
తేదీన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమానికి రాష్ట్ర
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విచేయుచున్న నేపథ్యంలో తగు ఏర్పాట్ల పై
అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరిగిందన్నారు. ఈ ఇఫ్తార్
విందుకు రాష్ట్ర నలుమూలల నుంచి మైనారిటీ సోదరులు విరివిగా పాల్గొనాలని
కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,,శాసన మండలి సభ్యులు
రుహుల్లా, స్థానిక కార్పొరేటర్లు తదితర మైనారిటీ నాయకులు, కార్యకర్తలు
పాల్గొన్నారు.