ఒంగోలు : రాష్ట్ర ప్రజలందరు సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు పడి కర్షకులు
అనందంగా ఉండాలని రాజ శ్యామల యాగం చేయిస్తున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్,
ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఒంగోలు లో ఎమ్మెల్యే బాలినేని
ఆధ్వర్యంలో రాజశ్యామాల యాగం ప్రారంభించారు. ప్రముఖ వేదం పండితులు మఠం పల్లి
దక్షిణమూర్తి నేత్రుత్వం లో వేద పండితులు యాగ క్రతువులు ప్రారంభించారు. తొలి
రోజు ఉదయం బాలినేని స్వగృహం లో బాలినేని దంపతులచేత కృతికా స్నానం వేద పండితులు
చేయించారు. అనంతరం సాయంత్రం టి టి డి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన యాగ శాల
వద్ద మండపా రాధన లాంటి వైదిక యాగాది క్రతువులను బాలినేని దంపతుల చేత వేద
పండితులు చేయించారు.
శ్రీ రాజ శ్యామలదేవి సహిత మహా మండపారధాన గావించారు. గణపతి పూజ, పుణ్య వాచనా,
అఖండ స్థాపన చేశారు. బాలినేని కుటుంబసభ్యులకు దీక్షా కంకణ దారణ గావించారు.
అనంతరం బాలినేని చేత అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం పండితులు చేశారు. గణపతి
హోమం అనంతరం మండప పూజ, చతుర్వేద పారాయణం, మహా దీపారాదన, మంత్రపుష్పమ్ పండితులు
గావించి శ్రీ రాజ శ్యామ్మలా దేవి కి దర్బారు సేవను వేదోక్తంగా నిర్వహించారు. ఈ
సందర్బంగా ఎమ్మెల్యే బాలినేని మాట్లాడుతూ ప్రజలందరూ ఈ యాగం తిలకించి అమ్మవారి
అనుగ్రహం పొందవలిసిందిగా విజ్ఞప్తి చేశారు.