విజయవాడ : తెలుగు జర్నలిస్టుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు,
వర్కింగ్ ప్రెసిడెంట్ మాలెంపాటి శ్రీనివాస రావు, లీగల్ అడ్వైజర్ దద్దాల జగదీశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ తుమ్మా విజయకుమార్ రెడ్డి ని ఆయన
కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘం విధివిధానాలు,
లక్ష్యాలను చైర్మన్ కు వివరించారు. ప్రతిభ కలిగిన జర్నలిస్టులను ప్రోత్సహించే
వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించామని ఇందులో భాగంగా తెలుగు జర్నలిస్టుల సంఘం
ఆధ్వర్యం లో ఉగాది పురస్కారాలకు రెండు తెలుగు రాష్ట్రాల లోని జర్నలిస్టుల
నుంచి ఎంట్రీలు కోరిందని తెలిపారు. దీనికి సంబంధించి వందల సంఖ్య లో ఎంట్రీలు
రాగా, వాటిలోంచి 23 విభాగాలకు చెందిన 25మందికి పురస్కారాలను ప్రకటించామని
వారు చైర్మన్ కు వివరించారు. వీరందరికి ‘మే’ నెల 2 వ తేదీన గుంటూరు లో ఒక
ప్రత్యేక ప్రదాన కార్యక్రమం నిర్వహించి అవార్డులు అందచేయనున్నామని వారు
తెలిపారు. ఆ అవార్డుల ప్రదాన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆంద్రప్రదేశ్
రాష్ట్ర సమాచార కమిషనర్ తుమ్మా విజయకుమార్ రెడ్డి ను సంఘం వ్యవస్థాపక
అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు కోరారు. అదే విధంగా తమ సంఘం లో సభ్యత్వం
తీసుకునే జర్నలిస్టులకు 10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నామని వారు
తెలిపారు. అదేవిధంగా నూతనంగా ఆవిర్భవించిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం
తరఫున జర్నలిస్టుల కు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా కమిషనర్
జర్నలిస్టుల అవార్డుల ప్రదాన కార్యక్రమానికి తాము హాజరవుతామని హామీ ఇచ్చారు.
తెలుగు జర్నలిస్టులకు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రశంసించి సభ్యులకు
శుభాకాంక్షలు తెలిపా రు