దిశగా ప్రభుత్వం కృషిచేస్తోందని హోంమంత్రి, ప్రకృతి విపత్తు నిర్వహణ శాఖ
మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. కొవ్వూరు మండలం మద్దూరు, ధర్మవరం
గ్రామాల్లో నిర్వహించిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమ సమావేశాల్లో ఆమెకు
నియోజకవర్గ నాయకులు, మండల ప్రజలు ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం
చేపట్టిన అనేక సంక్షేమ పథకాల సమాచారాన్ని సచివాలయాల కన్వీనర్లు, గృహ సారధులు,
వాలంటీర్లకు వివరించారు.
సమావేశంలో ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమం,
వారి యోగక్షేమాలను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి
వనిత మాట్లాడుతూ పత్రిపక్షం సంక్షేమం సంక్షోభమని అవాస్తవాలను ప్రచారం
చేస్తోందని నిజానికి ప్రతిపక్ష పార్టీనే సంక్షోభంలో ఉందన్నారు. సంక్షేమం,
అభివృద్ధి రెండు కళ్లుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో అమలు
చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా సమాజంలో అసమానతలు తగ్గించి,
పేదరికాన్ని నిర్మూలించే దిశగా రాష్ట్రం పయనిస్తోందని మంత్రి తెలిపారు. గత
ప్రభుత్వంలో చేసిన సంక్షేమం ఎంత?, ఈ ప్రభుత్వంలో చేసిన సంక్షేమం ఎంత.? వారు
చేసిన అభివృద్ధి ఏంటి..? మేం చేసిన అభివృద్ధి ఏంటి అని ధైర్యంగా ప్రజల్లోకి
వెళ్లి చెప్పగలుగు తున్నామన్నారు. ప్రతిపక్షం ఏం చేసిందో చెప్పుకోవడానికి లేక
అసత్య ప్రచారాలకు తెరలేపిందన్నారు. అబద్దపు ప్రచారాలను తిప్పికొడుతూ జగనన్నే
మా భవిష్యత్ కార్యక్రమం ద్వారా ప్రజలకు వాస్తవాలను వివరంగా చెప్పాలన్నారు. గృహ
సారధులు, సచివాలయాల కన్వీనర్లు చిత్త శుద్ధితో పనిచేయాలన్నారు. జగనన్నే మా
భవిష్యత్ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ‘జగనన్నే మా
భవిష్యత్తు’ స్టిక్కర్లను ప్రతి ఇంటికి వారి అనుమతి తీసుకున్న తర్వాతనే
అతికించాలని, అభ్యంతరం ఉంటే అతికించవద్దని తెలిపారు. సర్వే పూర్తి అయిన తర్వాత
82960 82960 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి నియోజకవర్గ పర్యటనకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి
వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలకాలని మంత్రి తానేటి వనిత కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.