బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. అనంతరం
తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకూ ర్యాలీ గా వెళ్లి జ్యోతి రావు పూలే విగ్రహానికి
పూలమాలలు వేశారు. ఈసందర్భంగా బిజెపి శ్రేణులు నినాదాలతో హోరెత్తించారు.
జ్యోతిరావు పూలే విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించిన సోము వీర్రాజు
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే
ఆలోచనలు దేశానికి ఒక జ్యోతిగా నేను భావిస్తున్నా. బడుగు బలహీన వర్గాలు కోసం
శయన ఎన్నో ఆలోచనలు చేశారు. విద్య, వితంతులు, మహిళాభివృద్ది కోసం అన్ని వర్గాల
వారిని కలిపారు. సమాజంలో మహిళలను ఆదర్శ వంతంగా మార్చారు. బిసి ల హాస్టల్
పరిశీలిస్తే కుక్కలు, పందులు తిరుగుతున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఈ
ఘటనలు నిదర్శనం అన్నారు. ప్రభుత్వం అధ్యయనం చేసిబాగా నడిపేలా చర్యలు
తీసుకోవాలి. ఎపి ప్రభుత్వం పూలే జీవితాన్ని అధ్యయనం చేసి హాస్టళ్ల ను
అభివృద్ధి చేయాలి. బిసి ల అభ్యున్నతికి మోడీ అనేక పధకాలు ప్రవేశ పెట్టారు. ఎపి
ప్రభుత్వం బిసి కుల గణన పూర్తి చేసి కేంద్రానికి పంపాలన్నారు. ఈకార్యక్రమంలో
బిజెపి ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు
వేటుకూరి సూర్య నారాయణ రాజు, బిట్రశివన్నారాయణ, బిజెపి నేతలు డాక్టర్ దాసం
ఉమామహేశ్వర రాజు, బబ్బూరి శ్రీ రాం, లక్ష్మీ పతి రాజా తదితరులు పాల్గొన్నారు.