విజయవాడ : జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట
మహేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వo కార్యక్రమం
53వ డివిజన్ అధ్యక్షులు పొట్నూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సైకం వారి వీధి
వద్దనుండి ప్రారంభించి సైకం వారి వీధి లో పర్యటించారు.
మీడియా పాయింట్ వద్ద పోతిన మహేష్ మాట్లాడుతూ ఇంటింటికి జనసేన ప్రభుత్వ
కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రజలందరూ కూడా తమ సమస్యలను
చెప్పుకుంటున్నారని ముక్యంగా ఈ డివిజన్లో ఒక దివ్యంగుడు గతంలో టాక్స్ పే
చేసినందువల్ల పెన్షన్ తొలగించారని స్థానిక కార్పొరేటర్ అయిన అప్పాజీ,
ఎమ్మెల్యే ను పలుమార్లు కలిసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారని, జగన్
మోహన్ రెడ్డి గారు కోడి కత్తి కేసులో కోర్టుకి హాజరైతే ట్రాఫిక్ సమస్యలు
వస్తాయని అందుకే కోర్టుకు హాజరు కానని కుంటి సాకులు చెప్పుకొస్తున్నారని అసలు
జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తే అది పరదాల చాటున బారికేడ్లు మాటున
సాగుతున్నాయని, సభలు పెడితే ప్రజలందరూ గోడలు దూకి పారిపోతున్నారన్నారు. అసలు
ఆయన పర్యటనకు వస్తే ఎక్కడా కూడా ట్రాఫిక్ జామ్ అయిన దాఖలాలు లేవని, కానీ
కోర్టుకు వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుందని కామెడీ డైలాగులు చెప్తున్నారని
అదేవిధంగా జడ్జి కూడా ఇట్లాంటి కారణాలును చూపిస్తే ఉపేక్షించకుండా జగన్మోహన్
రెడ్డి ని కోడి కత్తి కేసులో కచ్చితంగా హాజరు కావాలన్నారు. విశాఖ ఉక్కు
కర్మాగారం విషయంలో ఎందుకు జగన్ స్పందించడం లేదని కనీసం నోరు మెదపడం లేదని
తెలంగాణ సీఎం కేసీఆర్ ఉక్కు కర్మాగారం కొనుగోలు చేస్తానన్నా సీఎం జగన్
స్పందించడం లేదంటే జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎంపీలు బిఆర్ఎస్ పార్టీ ఇచ్చే
ప్యాకేజీ కి అమ్ముడు పోయినట్టేనని, విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటికరణ పై
కేంద్రప్రభుత్వాన్ని మీరు నిలదీయడం లేదంటే మీ మీద ఉన్న సిబిఐ కేసులకి ఈడి
కేసులకి, అవినాష్ రెడ్డి పై ఉన్న కేసులకి మీరు లొంగిపోయారని విశాఖ ఉక్కు
కర్మాగారాన్ని ఆదాని కి అమ్మిన కెసిఆర్కి అమ్మిన ఊరుకునేది లేదని ఆంధ్రప్రదేశ్
ప్రజల తరపున హెచ్చరించారు.
స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మైనార్టీల ద్రోహి అని గాలిబ్ షా
దర్గా స్థలాలు అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి అనేక వేల కోట్ల రూపాయల వీ ఎం
సీ ఆదాయానికి గండి కొడుతున్నా కనీసం.స్పందించడం లేదంటే అక్రమాలన్నీ స్థానిక
ఎమ్మెల్యే కనుసనల్లోనే జరుగుతున్నాయని ప్రజలకు అర్థమవుతుందన్నారు. ఈ
కార్యక్రమంలో డివిజన్ నాయకులు రేకపల్లి శ్రీనివాసరావు,మోహన్ రావు , అడ్డగిరి
పుల్లారావు, బొట్టు రవికుమార్ డివిజన్ అధ్యక్షులు నారాయణపు స్వామి ప్రదీప్
రాజ్, ఆకుల రవిశంకర్, రెడ్డిపల్లి గంగాధర్ ,కొరగంజి వెంకటరమణ, బత్తుల
వెంకటేష్, సిగానంశెట్టి రాము, మల్లెపు విజయలక్ష్మి , తిరుపతి అనూష, తమ్మిన
లీలా కరుణాకర్, ఏలూరు సాయి శరత్, బోమ్ము రాంబాబు ,వెన్న శివశంకర్ , స్టాలిన్
శంకర్, బోట్టా సాయి, తదితరులు పాల్గొన్నారు.