మహాత్మా జ్యోతిభా పూలే జయంతి వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి
విజయవాడ : స్థానిక భవానిపురంలో గల ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
జిల్లా కార్యాలయంలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు నిడుముక్కల శివ శంకర్ రావు
అధ్వర్యంలో బీసి ల ఆశా జ్యోతి మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకలు ఘనంగా
జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా
అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాస రావు పాల్గొని
జ్యోతిభా పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేకు కట్
చేశారు. ఈ సందర్బంగా వెలంపల్లి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పూలే జయంతి
వేడుకలు జరుగుతున్నాయన్నారు. పూలే ఆలోచన విధానాలు అమలు చేస్తున్న వ్యక్తి జగన్
మోహన్ రెడ్డి అని కొనియాడారు. సామాజిక అసమానతలు రూపుమాపేందుకు కృషి చేసిన
వ్యక్తి పూలే అని అన్నారు. ఆయన లక్ష్యాలను నేడు ఆచరిస్తున్న వ్యక్తి జగన్
మోహన్ రెడ్డి అని అన్నారు. నేటి అభినవ పూలే జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ
కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, బొప్పన భవకుమార్, దుర్గగుడి
చేర్మెన్ కర్నాటి రాంబాబు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ తోలేటి శ్రీకాంత్,
నాగవంశం కుల కార్పొరేషన్ చేర్మెన్ బొడ్డు అప్పలకొండ, వడ్డెర కార్పొరేషన్
డైరెక్టర్ దేరంగుల వెంకట రమణ, నగరాల కార్పొరేషన్ డైరెక్టర్లు శిరం వెంకట్రావు,
మజ్జి శ్రీదేవి శ్రీనివాస్, వన్య కుల కార్పొరేషన్ డైరెక్టర్ సైకం దుర్గ కుమారి
సాయిబాబు,గవర కార్పొరేషన్ డైరెక్టర్ దాడి అప్పారావు, బీసీ సెల్ జోనల్ ఇంచార్జ్
కొసగొని దుర్గారావు,ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్ బోర్డు గౌస్ మొహిద్దీన్, హబీబుల్లా,
ఎస్సి సెల్ నాయకులూ బూదాల శ్రీనివాసరావు, పొలిమెట్ల శరత్, వివిధ డివిజన్ల
కార్పొరేటర్లు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు
పాల్గొన్నారు.