వస్తుంది
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ చైర్మన్ పూనూరి గౌతమ్ రెడ్డి
విజయవాడ పశ్చిమ : శ్రీ దేవీ కరుమారి అమ్మన్ శక్తి పీఠం భవిష్యత్తు లో రెండో
కనకదుర్గమ్మ దేవాలయం స్థాయికి చేరుకొంటుందని ఆంధ్ర ప్రదేశ్ పైబర్ నెట్ చైర్మన్
పూనూరి గౌతమ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన సి వి ఆర్ ప్లై ఓవర్ బ్రిడ్జి
పక్కన ఉన్న శ్రీ దేవీ కరుమారి శక్తి పీఠం ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న 72
అడుగులు ఎత్తు మహా చండీ మట్టి విగ్రహం నిర్మాణ పూజలో గౌతమ్ రెడ్డి తొలి
కొబ్బరికాయ కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి రావడం
తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. చెన్నై నుండి ప్రత్యేకంగా వచ్చిన సుమారు
100 మంది నిపుణులు రాగా ఈ నిర్మాణ పనులు లాంఛనంగా ప్రారంభించారు. తొలుత గౌతమ్
రెడ్డి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అర్చకులు దీక్షితులు గౌతమ్ రెడ్డి
కుటుంభ సబ్యుల గోత్ర నామాలతో పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో ఆయనకు
పీఠాధిపతి స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం అమ్మవారి జ్ఞాపికను
బహుకరించారు.
అలాగే సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా ఈ శక్తి పీఠాన్ని
సందర్శించారు. ఆయన్ని కూడా ఆలయ మర్యాదలతో సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు.
ఆయనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఈ నెల 27 నుండి మే 3 తేదీ
వరకు తలపెట్టిన సహస్ర చండీ యాగం ప్రత్యేకతను పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కరుమారి
దాసు గౌతమ్ రెడ్డికి, విష్ణు కి వివరించారు. ఈ కార్యక్రమంలో శక్తి పీఠం
పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు, ఆలయం ట్రస్ట్ కోశాధికారి జ్ఞానేశ్వర్,
సునీత, మాదల శ్రీనివాస్ రెడ్డి, ట్రస్ట్ సభ్యులు చంద్రకళ, బత్తిన
వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.