టాలీవుడ్ సినీ పరిశ్రమలో నంది అవార్డులను ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు.
అయితే గత కొన్నేళ్లుగా ఈ అవార్డుల ప్రధానోత్సవంలో జాప్యం జరుగుతోన్న విషయం
తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందించారు.
తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా నంది అవార్డులు ఇవ్వాలని కోరారు.
హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం
నంది అవార్డులు తప్పనిసరిగా దృష్టి సారించాలని తద్వరా తెలంగాణ సంస్కృతిని
ప్రతిబింబించే చిత్రాలకు అవార్డులని సూచించారు. తెలంగాణను కొత్తగా చూపించే
చిత్రాలను సయితం ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు . 90 శాతం సినిమా స్థానికంగా
చేస్తే రాయితీలతో పాటు అవార్డులు ఇవ్వాలని ఆయన తెలంగాణ ప్రభుత్వానికి
సూచించారు.
చిత్ర పరిశ్రమను ప్రోత్సహించాలన్న విజయేంద్ర ప్రసాద్.. దీని ద్వారా
రాష్ట్రం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. సినిమా మాధ్యమం అనేది
చాలా శక్తిమంతమైందని, తెలంగాణలో చాలా పర్యాటక ప్రదేశాలున్నాయన్నారు. దీని
ద్వారా సినిమా చిత్రీకరణ జరిగిన ప్రాంతాలు పర్యాటకంగా మరింత అభివృద్ధి
చెందడానికి అవకాశం ఉంది. ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ చిత్రంతో
స్విట్జర్లాండ్లో భారత పర్యాటకుల సంఖ్య పెరిగింది. తెలంగాణలోనూ ఈ విధంగా
పర్యాటకరంగాన్ని ప్రోత్సహించవచ్చని ఆయన తెలంగాణలో నంది అవార్డులపై కీలక
వ్యాఖ్యలు చేశారు విజయేంద్ర ప్రసాద్.