జెయింట్స్ ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. వరుస వికెట్లు కోల్పోయిన
లక్నోకి విజయం సందేహమే అనుకున్న ఈ మ్యాచ్‌లో.. చివరి బంతికి సింగిల్ తీయడం
ద్వారా విజయం సొంతమైంది:
అంతకముందు ఆర్సీబీ తరఫున హాఫ్ సెంచరీలు చేసి త్రిమూర్తులుగా నిలిచిన
కోహ్లీ, డూప్లెసీస్, మ్యాక్స్‌వెల్ పరుగులు వృధా అయ్యాయి. ఇక లక్నో తరఫున
మార్కస్ స్టోయినిస్ 65, నికోలస్ పూరన్ 62, ఆయుష్ బదోని 30, కేఎల్ రాహుల్ 18
పరుగులతో రాణించారు. అయినప్పటికీ చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్‌ని లక్నో
టెయిలెండర్లే గెలిపించారని చెప్పుకోవాలి.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల
నష్టానికి 212 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఆర్సీబీ తరఫున రంగంలోకి దిగిన
నలుగురిలో ముగ్గురు అర్థశతకాలు పూర్తి చేసుకున్నారు. అలాగే ఆర్సీబీ తరఫున
ఓపెనర్లుగా వచ్చిన కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్, విరాట్ కోహ్లీ తమ జట్టుకు
శుభారంభాన్ని అందించారు. ఈ ఇద్దరు కలిసి మొదటి వికెట్‌కి 96 పరుగులు
భాగస్వామ్యాన్ని అయితే 12వ ఓరవ్ వేసిన అమిత్ మిశ్రా బౌలింగ్‌లో స్టోయినిస్‌కి
క్యాచ్ ఇచ్చిన కింగ్ కోహ్లీ పెవిలియన్ చేరాడు. దీంతో గ్లెన్ మ్యాక్స్‌వెల్
క్రీజులోకి దిగి, ఫాఫ్‌తో జత కలిసాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన ఈ
ద్వయం రెండో వికెట్‌కి 115 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.
లక్నో బౌలర్ మార్క్ వుడ్. వుడ్ వేసిన 20వ ఓవర్ 5వ బంతిని ఆడిన
మ్యాక్సీ(59) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇక అతను డ్రెస్సింగ్ రూమ్ బాట పట్టడంతో
దినేష్ కార్తిక్(1) మైదానంలోకి దిగి ఇన్నింగ్స్ చివరి బంతికి సింగిల్ తీశాడు.
అలాగే కెప్టెన్ డూప్లెసీస్ అజేయంగా 79 పరుగులు చేశాడు. ఈ క్రమంలో లక్నో తరఫున
మిశ్రా, మార్క్ వుడ్ చెరో వికెట్ తీసుకున్నారు.