చేపట్టారు. సోమవారం విద్యాశాఖపై సమీక్ష అనంతరం వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్
సమీక్ష నిర్వహించారు.
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో తీసుకోవాల్సిన
జాగ్రత్తలపై సీఎం జగన్ ప్రధానంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి
మంత్రి విడదల రజిని, సీఎస్ జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ కరోనా
వ్యాపిస్తుందన్న సూచనలు నేపధ్యంలో అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం
ఆదేశించారు. గ్రామ స్ధాయిలోనే పరీక్షలు నిర్వహించి, అక్కడే మందులు ఇచ్చేలా
చర్యలు తీసుకోవాలని, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతున్న వారికి కోవిడ్ సోకితే
వారిని వెంటనే హాస్పిటల్‌కి తరలించేలా చర్యలుండాలన్నారు. కోవిడ్ తాజా
పరిస్థితి, నివారణకు తీసుకుంటున్న చర్యలను సీఎంకు అధికారులు వివరించారు.
పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. పెద్దగా ఆందోళన
చెందాల్సిన అవసరం లేదన్న అధికారులు విలేజ్ క్లినిక్స్ స్ధాయిలోనే ర్యాపిడ్
టెస్టులు చేసే వ్యవస్థ ఉందని, అక్కడ ఏమైనా తేలితే వెంటనే ఆర్టీపీసీఆర్కు
పంపించే ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్
సర్వే చేయించామని, కేవలం 25 మంది మాత్రమే కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరారని
అధికారులు వివరించారు. ఆక్సిజన్ లైన్లు, పీఎస్ఏ ప్లాంట్లు, ఆక్సిజన్
సిలెండర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు వీటన్నింటినీ కూడా చెక్ చేసి
సిద్ధంచేసుకుంటున్నామన్న అధికారులు అంతర్జాతీయ విమాన ప్రయాణికులనుంచి
ర్యాపిడ్ శాంపిల్స్ తీసుకునేందుకు విమానాశ్రయాల్లో అన్నిరకాలుగా
సిద్ధంచేశామన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ముందు
జాగ్రత చర్యల్లో భాగంగా అన్నిరకాలుగా సిద్ధం కావాలన్నారు. ఎప్పటికప్పుడు
పరిస్థితిని చూసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. ఫ్యామిలీ
డాక్టర్, విలేజీ క్లినిక్స్ వ్యవస్ధ కోవిడ్ విస్తృతిని అడ్డుకోవడానికి, మంచి
వైద్యం అందించేలా చేయడానికి ఉపయోగపడుతుందన్న సీఎం గ్రామాల్లో సర్వే చేసి,
లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి, వారికి వెంటనే మందులు ఇచ్చేలా
చూడాలన్నారు. ప్రతి విలేజ్ క్లినిక్‌కూ టెస్టింగ్ కిట్స్, మందులు పంపించాలని
సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న వేరియంట్‌కు తగినట్టుగా మందులు
తెప్పించుకోవాలని, ల్యాబులను అన్నింటినీ కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధం
చేసుకోవాలన్నారు.
జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణ పనులపైనా సీఎం జగన్ సమీక్ష
మొదటి ప్రాధాన్యతలో నిర్దేశించుకున్న విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు,
నంద్యాల్లో షెడ్యూలు ప్రకారం పనులు జరుగుతున్నాయని అధికారులు వివరించారు.
మిగిలిన కాలేజీల్లో కూడా పనులను ముందుకు తీసుకెళ్తున్నామని అధికారులు
వివరించారు. పూర్తయ్యే దశలో పలాస కిడ్నీ స్పెషాల్టీ హాస్పిటల్, కర్నూలులో
కేన్సర్ ఇనిస్టిట్యూట్, వైయస్సార్ కడపలో జీజీహెచ్ సూపర్ స్పెషాలిటీ,
కేన్సర్ విభాగంతో సహా మూడు బ్లాకులు ఉన్నాయన్నారు. కొన్నిరోజుల్లో ఇవి
పూర్తిగా సిద్ధమవుతాయని అధికారులు తెలిపారు.