కొవ్వూరు : రాష్ట్రంలోని యువత కలలను సాకారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎల్లప్పుడూ సహకారం అందిస్తోందని రాష్ట్ర హోంమంత్రి, విపత్తు నిర్వహణ శాఖ
మంత్రి డా. తానేటి వనిత తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి
చెందిన ప్రముఖ టేబుల్ టెన్నిస్ ప్లేయర్, ప్రపంచ పర్వతారోహకుడు ఆచంట ఉమేష్
కుమార్ కొవ్వూరులోని హోంమంత్రి క్యాంపు కార్యాలయంలోని సోమవారం మంత్రిని
కలిశారు. ఉమేష్ కుమార్ తాను సాధించిన రికార్డులు, అవార్డులు, రివార్డులను
మంత్రికి వివరించారు. ప్రపంచంలోని 7 ఖండాల్లో అత్యంత ఎత్తైన పర్వతాల్లో
ఇఫ్పటికే 3 ఖండాల్లో అధిరోహించినట్లు మంత్రికి వివరించారు. ఈ సంవత్సరం
ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ ని ఎక్కడానికి సన్నద్దం
అవుతున్నట్లు మంత్రికి తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున తగిన ప్రొత్సాహం,
సహకారం ఉంటుందని అభినందించారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని
శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిభ కలిగిన యువతను ప్రొత్సహించడంలో ముఖ్యమంత్రి
వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ముందంజలో ఉంటారని మంత్రి తానేటి వనిత అన్నారు.
ఆచంట ఉమేష్ 2021 సంవత్సరం లో ఆఫ్రికా ఖండం లోని అతి ఎత్తయిన పర్వతం మౌంట్
కిలిమంజారో ను, 2022 లో యూరోపు ఖండం లో అతి ఎత్తైన మౌంట్ ఎల్ బ్రస్ ను, 2022
నవంబర్ లో ఆస్ట్రేలియా ఖండంలో అతి ఎత్తైన పర్వతం మౌంట్ కోజిస్కో ను
అధిరోహించాడు. ఉమేష్ పర్వతం ఎక్కటం తో పాటుగా అతి పెద్ద భారత దేశ జాతీయ జెండా
పర్వతాల మీద ఎగురవేయడం ద్వారా అనేక వరల్డ్ రికార్డ్స్ లు సాధించాడు.