విజయవాడ : ఏపిజెఏసి రాష్ట్రకమిటి ఇచ్చిన మలిదశ ఉద్యమ కార్యచరణలో భాగంగా ఈనెల
11 న మంగళవారం ఒక్కరోజు ప్రభుత్వ ఉద్యోగులంతా సెల్ పోన్ వినియోగించకుండా
ఉద్యోగులలో ఉన్న ఆవేదనను, నిరసనను ప్రభుత్వానికి తెలియజేసేలా ఈ సెల్ డౌన్
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు
వెంకటేశ్వర్లు, సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు సోమవారం ఒక ప్రకటద్వారా
ఉద్యోగులకు పిలుపునిచ్చారు. సోమవారం మలి దశ ఉద్యమ కార్యచరణలో బాగంగా
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాకలెక్టర్ కార్యాలయాలలో
ఉద్యోగ,ఉపాధ్యయ,కార్మిక,రిటైర్డు,కాంట్రాక్టు & ఔట్ సోర్శింగ్ ఉద్యోగుల
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఫిభ్రవరి 13 న 50 పేజీలతో సియస్ కి ఇచ్చిన
మెమోరాండం కాఫీలను అందరికలెక్టర్లకు స్పందన కార్యక్రమాలద్వారా ఇస్తూ
ఉద్యోగులలో ఉన్న ఆవేదనలు ప్రభుత్వం దృష్టికీ తీసుకొని వెళ్లమని కలెక్టర్లకు
విజ్ఞప్తి చేస్తూ 26 జిల్లాలలో ఉన్న ఏపిజెఏసి అమరావతి జిల్లా చైర్మన్లు/ప్రధాన
కార్యదర్శులు, ఇతర నాయకులు ఆధ్వర్యంలో మెమోరాండాలు సమర్పించడం జరిగిందని
తెలిపారు. అలాగే ఈ ఉద్యమ కార్యాచరణలో బాగంగా ఈనెల 11 ను సెల్ డౌన్
కార్యక్రమంతో పాటు ఈనెల 12 న అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలవద్ధ
ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా కార్యక్రమాలు కూడా
నిర్వహిస్తున్నామని జెఏసి నాయకులు బొప్పరాజు, పలిశెట్టి తెలిపారు.