40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు గుడివాడ వచ్చి కొత్తగా ఏం చెబుతాడు
40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న బాలకృష్ణ కామెంట్ కు ఎమ్మెల్యే
కొడాలి నాని కౌంటర్
వై నాట్ అంటున్న బాలయ్యకు ఎన్నికల అనంతరం జగన్ అంటే తెలుస్తుంది
2019లో అల్లుళ్లకు పట్టిన గతే 2024 ఎన్నికల్లో జగన్ చేతిలో బావా, బామ్మర్దులకు
పడుతుంది
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని
గుడివాడ : టిడిపి అధినేత చంద్రబాబు గుడివాడ పర్యటన పై ఎమ్మెల్యే కొడాలి నాని
స్పందించారు. 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు నేడు గుడివాడకు వచ్చి
కొత్తగా ఏం చెబుతాడని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు గుడివాడ వచ్చినా బెజవాడ
వచ్చినా, రాష్ట్రమంతా తిరిగిన శ్రమ ఆయాసం తప్ప ప్రయోజనం ఉండదని కొడాలి నాని
ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు శని గ్రహం లాంటివాడని, ఆయన ఎక్కడ ప్రచారం
చేస్తే అక్కడ శని తాండవిస్తుందని, చంద్రబాబు ప్రచారం చేసిన చోట టిడిపి
అభ్యర్థి గెలవడనీ కొడాలి నాని అన్నారు. నాడు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన
ప్రజలను గాలికి వదిలేసిన చంద్రబాబు, తన కోటరీ ఆస్తుల పెంపకానికే పాటుపడ్డాడని,
చంద్రబాబు నైజమేంటో ప్రజలందరికీ తెలుసని కొడాలి నాని స్పష్టం చేశారు.
40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారన్న బాలకృష్ణ కామెంట్ కు,
ఎమ్మెల్యే కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. ప్రజల్లో విశ్వాసం, కార్యకర్తల్లో
నమ్మకం లేని వారికి జగన్ సీట్లువ్వడనీ, విశ్వాసం లేని ఎమ్మెల్యేల కోసం
ప్రభుత్వాన్ని, ప్రజల్ని పణంగా పెట్టనని జగన్ చెప్తున్నాడనీ ఎమ్మెల్యే నాని
తెలిపారు. ప్రజల్లో మమేకమవుతూ, వారి అభిమానాన్ని పొందిన వారికి జగన్ తప్పకుండా
సీట్లు ఇస్తాడనీ కొడాలి నాని స్పష్టం చేశారు. మేము సీట్లు ఇవ్వని ఎమ్మెల్యేలు
చంద్రబాబుతో టచ్ లో ఉంటే మాకేమవుతుందనీ ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ఏడాదిలో
ప్రజలు టచ్ లో ఉంటే సరిపోతుందని, ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన వారు కాదని గురైన
వారు కాదని కొడాలి నాని అన్నారు. బాలయ్య వీర తిలకం దిద్ది పంపిన అల్లుళ్ళను
2019లో ఇంటికి పంపినట్లే, బావ, బావమరిదిలైన బాలయ్య, చంద్రబాబులను 2024
ఎన్నికల్లో జగన్ ఇంటికి పంపుతాడనీ ఆయన జోస్యం చెప్పారు. జగన్ వై నాట్ అంటే
ఏంటో చూడాలనుకుంటున్న బాలయ్యకు ఎన్నికల తర్వాత తెలుస్తుందని కొడాలి నాని
అన్నారు.