కడప : క్రీడాకారులు క్రీడలలో మెలుకువలను చూసుకొని ఉన్నత స్థాయి క్రీడా
పోటీలలో పాల్గొని జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలని రాష్ట్ర ఉప
ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ భాష, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి
సంయుక్తంగా పేర్కొన్నారు. స్థానిక డాక్టర్ వైయస్సార్ స్పోర్ట్స్ స్కూల్ నందు
కరీముల్లా మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ మరియు జిల్లా వాలీబాల్ అసోసియేషన్
కడప వారి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో వాలీబాల్ క్రీడలో ప్రతిభ
కనపరిచిన వారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ భాష, జడ్పీ చైర్మన్
ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా సత్కార కార్యక్రమం జరిగింది. ఈ
సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ భాష ముఖ్యఅతిథిగా పాల్గొని
మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడల పట్ల మక్కువ చూపి మెలకువలను నేర్చుకొని
ఉన్నతస్థాయి క్రీడా పోటీలలో పాల్గొని జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో మంచి
పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో క్రీడలకు పెద్దపీట
వేసి ప్రాధాన్యతను కల్పించి క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతోందని
క్రీడాకారులు ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. అనంతరం జిల్లాస్థాయి,
రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలలో వాలీబాల్ క్రీడలో ప్రతిభ కనబరిచిన వారికి
దుశాల్వాతో సత్కరించి జ్ఞాపికలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ భాష,
జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ
కార్యక్రమంలో షాప్ స్టేట్ డైరెక్టర్ ప్రదీప్, రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా
శ్రీనివాసులు రెడ్డి, షాప్ డైరెక్టర్ రెసిడెన్షియల్ ప్రతాప్, సుభహాన్ భాష,
స్పెషల్ ఆఫీసర్ భాష మొహిద్దిన్, వాలీబాల్ సెక్రటరీ ఖాదర్ వల్లి, సెక్రటరీ సేగు
సూర్య ప్రకాష్, ఓ శివారెడ్డి, న్యాయవాది సుబ్బరామిరెడ్డి, కోలా కొండయ్య, ఫోర్
స్కూల్ అధికారులు, అనధికారులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.