తూర్పుగోదావరి : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బీఆర్ఎస్ తీవ్రంగా
వ్యతిరేకిస్తుందని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. స్టీల్
ప్లాంట్‌కు క్యూపిటివ్ మైన్స్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం లేదా
రాష్ట్రం ఐదు వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేస్తే స్టీల్ ప్లాంట్
ప్రైవేటీకరణ అవసరం లేదన్నారు. వైసీపీకి 31 మంది ఎంపీలు ఉన్నా స్టీల్ ప్లాంట్
ప్రైవేటీకరణ ఆపలేకపోయారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో ఏపీలో 175 అసెంబ్లీ
స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందన్నారు. దేశంలో బీజేపీ కి ప్రత్యేకంగా
బీఆర్ఎస్ అభివృద్ధి చెందబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కి ఉన్న
అనుభవం, పరిణితి దేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడికి లేవన్నారు. ఆంధ్రప్రదేశ్
కూడా కేసీఆర్ నాయకత్వాన్ని తీసుకుంటే తెలంగాణలా అభివృద్ధి చెందుతుందన్నారు.