ఛాలెంజ్‌లతో అమరావతిలో ఉద్రిక్తత
మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అరెస్ట్
మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ గుంటూరుకు తరలింపు
పెదకూరపాడు నుంచి గుంటూరుకు తరలించిన పోలీసులు
అమరావతిలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు అరెస్టు
టీడీపీ నేతలు, కార్యకర్తలను క్రోసూరు స్టేషన్ కు తరలింపు
పల్నాడు : అమరావతిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇసుక అక్రమ తవ్వకాలపై వైసీపీ,
టీడీపీ నేతల మధ్య సవాళ్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇసుక అక్రమ తవ్వకాలపై
ఎమ్మెల్యే శంకరరావు, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
అమరలింగేశ్వర ఆలయం సమావేశం అవుదామని సవాళ్లు విసిరారు. ఈ నేపథ్యంలో వైసీపీ,
టీడీపీ కార్యకర్తలు సన్ననద్ధం అవుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాగా
ఆదివారం రాత్రి వరకు పోలీసులు 144 సెక్షన్ విధించారు. టీడీపీ నేతలకు 149
సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. అమరావతి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు
పేర్కొన్నారు. 5 మండలాల్లో 200 మంది నేతలకు పోలీసుల నోటీసులు ఇచ్చారు. ఈ
క్రమంలో అమరావతిలో ఎప్పుడు ఏం జరుగుతుందా అని ఉత్కంఠ నెలకొంది. ఎటువంటి ఘటనలు
జరగకుండా ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు.
ఇసుక తవ్వకాలపై వైసీపీ, టీడీపీ నేతల సవాళ్లతో పెదకూరపాడు నియోజకవర్గంలో
ఉత్కంఠ నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, టీడీపీకి చెందిన మాజీ
ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వం నడిచింది.
నేతలిద్దరూ ఆదివారం అమరావతిలోని అమరేశ్వరస్వామి ఆలయంలో ప్రమాణం చేస్తామని
ప్రకటించడంతో ఏం జరుగుతోందననే ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఆలయం వద్దకు ఇరు
పార్టీల కార్యకర్తలు బయల్దేరారు. దీంతో అక్కడ 144 సెక్షన్ విధించి భారీగా
పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు శనివారం రాత్రే ఆలయ పరిసరాలకు
చేరుకోగా ఆదివారం ఉదయం కొమ్మాలపాటి శ్రీధర్ అక్కడికి బయల్దేరారు. ఈ క్రమంలో
అమరావతి పట్టణంలో ఆలయానికి కొద్దిదూరంలోని క్రోసూరు కూడలి వద్ద శ్రీధర్‌ను
పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. పెద్ద ఎత్తున
అక్కడికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో కొమ్మాలపాటి
శ్రీధర్ అక్కడి నుంచి తరలించారు. అనంతరం ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
అమరేశ్వరస్వామి గాలిగోపురం వద్దకు వైసీపీ శ్రేణులతో చేరుకుని కొమ్మాలపాటికి
వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు వైసీపీ కార్యకర్తలను అక్కడి
నుంచి పంపించేశారు.
మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ అరెస్టు..టీడీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ : అమరావతిలో
టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఇసుక అక్రమ తవ్వకాలపై పెదకూరపాడు ఎమ్మెల్యే
నంబూరి శంకరరావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ చేసుకున్న సవాళ్లు తీవ్ర
ఉద్రిక్తతలకు దారితీశాయి. అమరావతిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఇసుక
అక్రమ తవ్వకాలపై పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకరరావు, మాజీ ఎమ్మెల్యే
కొమ్మాలపాటి శ్రీధర్ చేసుకున్న సవాళ్లు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి.
ముందుగా టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్ పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి
అమరలింగేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. దీంతో పోలీసులు శ్రీధర్‌ను
అడ్డుకుని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్
చేసి పలువురిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై కొమ్మాలపాటి
మండిపడ్డారు. ఇసుక అక్రమ తవ్వకాలపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య సవాళ్లపై ఉత్కంఠ
కొనసాగుతోంది.
కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ అమరావతిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు
జరుగుతున్నాయని, దీనిపై తాను ఎప్పుడైనా చర్చకు సిద్ధమని తేల్చి చెప్పారు.
నదిలో తవ్విన గోతుల వల్లే అనేకమంది చనిపోతున్నారన్నారు. టీడీపీ పాలన నాటి
అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమన్నారు. అలాగే ఇసుక దోపిడీ, మట్టి మాఫియా, ఇళ్ల
నిర్మాణంపై చర్చకు కూడా సిద్ధమన్నారు. వైసీపీ హయాంలో ఎక్కడా అభివృద్ధి
జరగలేదని, ఆధారాలతో సహ చర్చకు వచ్చామని కొమ్మాలపాటి శ్రీధర్ పేర్కొన్నారు. ఈ
క్రమంలో ఎమ్మెల్యే శంకర్రావు కూడా అమరలింగేశ్వర ఆలయానికి వచ్చారు. తాను
ఆధారాలతో వచ్చానని, ఏ తప్పు చేయలేదని అన్నారు. టీడీపీ వాళ్లు ప్రమాణం చేస్తే
తాను కూడా ప్రమాణం చేస్తానని అన్నారు. అప్పటి వరకు ఆలయం వద్దే ఉంటానని స్పష్టం
చేశారు. కాగా ఎమ్మెల్యేకు మద్దతుగా వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.
కొమ్మాలపాటి శ్రీధర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మరోవైపు టీడీపీ
కార్యకర్తలతోపాటు సామాన్య ప్రజలను కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నారని
పలువురు మండిపడుతున్నారు. పసుపుచీర కట్టుకున్నానన్న కారణంతో తనను అరెస్టు
చేశారని ఓ మహిళ వాపోయింది. కాగా ఉద్రిక్తతల నేపథ్యంలో అమరేశ్వరస్వామి ఆలయానికి
వెళ్లే దారిని పోలీసులు మూసివేశారు.