జలుమూరు : ఎన్నికల ముందు మా నాయకుడు ఏదైతే దైవంగా భావించి మేనిఫెస్టోను
ప్రకటించారో, అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో అంశాలన్నీ తు.చ తప్పకుండా 98
శాతం అమలు చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సీనియర్
శాసనసభ్యులు ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. జలుమూరు మండలం కొమనాపల్లిలో గడపగడపకు
110వ రోజు కార్యక్రమంలో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ఇటీవల
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపబోదని, తమ
పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలిచిందన్నారు. ప్రజలకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ
కార్యక్రమాలు చేపట్టిన కారణంగా ఆశీర్వదించాలని కోరుతూ గడపగడపకు రానున్న 14
రోజులు పాటు తమ గృహసారథులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్తారని
వివరించారు. గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి తేడాను స్పష్టంగా అడుగుతామని
చెప్పారు. రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలు తమ వైపే ఉన్నారనడానికి రానున్న 14
రోజుల కార్యక్రమం స్పష్టంగా తేట తెల్లం చేస్తుందని కృష్ణ దాస్ పేర్కొన్నారు.