విజయసాయిరెడ్డి
విజయవాడ : రాష్ట్ర ఫ్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలతో విద్య రంగాన్ని కొత్త
పుంతలు తొక్కిస్తుందని రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ
కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు పలు అంశాలపై ఆయన శనివారం పలు
అంశాలపై సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.స్మార్ట్ ఫొనుల్లో,ట్యాబుల్లో
ఈ-కంటెంట్ అందిస్తున్న ప్రభుత్వం ఇక నుండి ఈ- పాఠశాలలను
ప్రవేశపెట్టనుందన్నారు. అందులో బాగంగా ఎస్ఈఆర్టీ ద్వారా 4 వ తరగతి నుంచి 9
తరగతి వరకు ఈ- కంటెంట్ ను అందించనుందని చెప్పారు. ఈ కొత్త విధానం వచ్చే ఎడాది
నుంచి అమలు కానుందని వెల్లడించారు.2024-25 లో సిలబస్ మార్పు అనంతరం పదో
తరగతికి కూడ ఈ విధానం అందుబాటులోకి రానుందని చెప్పారు.
జగనన్నే మా భవష్యత్తు కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ పనితీరుపై ఎవరిని
కదిపినా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు.మా నమ్మకం నువ్వే జగన్
అంటూ జనం నినాదాలు చేస్తున్నారని వెల్లడించారు. కోవిడ్ కేసులు 400 శాతం
పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేసిన ఆయన దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న
కోవిడ్-19 మహమ్మారితో అప్రమత్తంగా ఉండాలని పలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం
డిమాండ్ చేసిన విధంగా 20 లక్షల బూస్టర్ డోసులను కేటాయించాలని కేంద్రమంత్రి
మాండవియాను విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఎంతో కాలంగా వైఎస్ఆర్
సిపి ఎంపిలు కేంద్రాన్ని కొరుతున్న విధంగా హైదరాబాద్-తిరుపతి వందే భారత్
రైలును శనివారం ప్రారంభించడంపై ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదలు తెలిపారు.