విజయవాడ : ఆంధ్రప్రదేశ్ వైద్యరంగానికి సరికొత్త సేవలు అందిస్తున్న మణిపాల్
హాస్పిటల్స్ నగరంలోని గేట్ వే హోటల్ లో ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు
చేసింది. ఈ సందర్భంగా మణిపాల్- సౌత్ ఏషియన్ లివర్ యూనిట్ భాగస్వామ్యంతో గడిచిన
ఆరు నెలల్లో సాధించిన అద్భుతమైన చికిత్స ఫలితాలను వెల్లడించింది. ఈ
సందర్భంగా సౌత్ ఏషియన్ లివర్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు, సీనియర్ లివర్
స్పెషలిస్ట్ , ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్
మాట్లాడుతూ విజయవాడలో మాత్రమే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వైద్య
సేవల నిమిత్తం వచ్చే వారికి మణిపాల్ హాస్పిటల్ ఇప్పటికే కేర్ ఆఫ్ అడ్రెస్ గా
మారింది. రోగులకు కావాల్సిన అనేక వైద్యసేవలను ఇప్పటికే చాలా వరకు మణిపాల్
హస్పిటల్ అందుబాటులోకి తీసుకుని వచ్చింది. అంతేగాకుండా ప్రస్తుతం ఈ హాస్పిటల్
లో అత్యంత క్లిష్టమయిన కాలేయ శస్త్రచికిత్సలను కూడా ఇప్పుడు పూర్తి చేశాము.
ఇందులో ముఖ్యంగా మరణాంతర కాలేయ మార్పిడి, కాలేయ దాతల ద్వారా చేసే మార్పిడి ,
క్యాన్సర్లకు లివర్ రెసెక్షన్లు, పోర్టల్ వెయిన్ థ్రాంబోసిస్ కోసం
మార్పిడి,చిన్న వయసు వారిలో కాలేయ మార్పిడి లాంటి మొదలైనవి మణిపాల్ హాస్పిటల్
లో నిర్వహించాము. కాలేయ వ్యాధి నాణ్యమైన చికిత్సకు సరైన నిపుణుల బృందం, మౌలిక
సదుపాయాలు అవసరం. కాలేయ మార్పిడి అనేది సంక్లిష్టమైన, సాంకేతికంగా డిమాండ్
ఉన్న శస్త్రచికిత్స, శిక్షణ పొందిన ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లచే నియమించబడిన
కాలేయ మార్పిడి కేంద్రాలలో మాత్రమే చేయబడుతుంది. ఇప్పటి వరకు కాలేయ మార్పిడి
శస్త్రచికిత్స కోసం రోగులు ఇతర రాష్ట్రాల వైపు చూసే వారు. కానీ కీలకమైన కాలేయ
శస్త్ర చికిత్సలు మణిపాల్ హాస్పిటల్ – సౌత్ ఏషియన్ భాగస్వామ్యంలో చేయడంతో
స్థానిక ప్రజలకు వరంగా మారింది. కాలేయ రోగులు చాలా వరకు మణిపాల్ హాస్పిటల్
లోనే చికిత్స చేయించుకుంటున్నారని అన్నారు. అంతేగాకుండా మరిన్ని విషయాలను
మీడియాకు వెల్లడించారు ప్రొ. డా. టామ్ చెరియన్. కాలేయ రోగులకు చికిత్స చేయడంలో
మేము సాధించిన విజయాలను ప్రజలతో పంచుకునేందుకు నేను సంతోషిస్తున్నాను. కాలేయ
వ్యాధితో బాధపడే ఇతరుల మాదిరి గానే నిర్భయంగా ముందుకు వచ్చి సాధారణ జీవితాన్ని
తిరిగి పొందేలా ప్రోత్సహించడం, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి ప్రజల్లో
ఉన్న వివిధ అపోహలను, భయాలను తొలగించాలని మేము కోరుకుంటున్నాము. ఆల్కహాల్,
మధుమేహం, ఊబకాయం ఉన్న రోగులలో కొవ్వు కాలేయ వ్యాధి, దీర్ఘకాలిక వైరల్
ఇన్ఫెక్షన్లు, జీర్ణక్రియ కాలేయ వ్యాధులు మొదలైన వాటి కారణంగా చివరి దశకు
చేరుకున్న వారికి కూడా అధునాతన కాలేయ మార్పిడి పద్దతుల ద్వారా అద్భుతమైన
చికిత్సను అందిస్తున్నాం. ఈ సందర్భంగా మణిపాల్ హాస్పిటల్ విజయవాడ డైరెక్టర్
డా. సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ “మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో కాలేయ
చికిత్సకు సంబంధించి కావలసిన వైద్య సదుపాయాలు అన్నీ కూడా పూర్తి స్ధాయిలో
అందుబాటులో ఉన్నాయి. వైద్య నిపుణులు, పారామెడిక్స్ కు మణిపాల్ ప్రసిద్ధి
చెందింది. భారతదేశంలో సుమారు 50వేల మంది కాలేయ మార్పిడి కోసం ఎదురుచూస్తుండగా,
కేవలం 25 కాలేయ మార్పిడి కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. ఇవి సంవత్సరానికి 800
నుండి 1,000 మార్పిడిని నిర్వహిస్తున్నాయి. విజయవాడ ప్రజలు ఆరోగ్య సంరక్షణ
సౌకర్యాలను ఉపయోగించుకోవాలని నాణ్యమైన చికిత్సను పొందాలని మేము
కోరుతున్నామన్నారు. అంతేగాకుండా అవయవ మార్పిడిలో భారతదేశం ప్రపంచలోనే
అగ్రగామిగా ఎదుగుతోంది. అవయవ మార్పిడికి సంబంధించి విజయవాడ ప్రజలకు నాణ్యమైన
చికిత్సను అందించిందుకు మణిపాల్ హాస్పిటల్ కట్టుబడి ఉంది. ఇప్పటికి వరకు మేము
సాధించిన విజయాలు మా నిబద్ధతను తెలియపరుస్తాయి. ఇదే విధంగా విజయవాడలోని
మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా కాలేయ మార్పిడిని నిర్వహించి ప్రజల జీవితాల్లో
వెలుగులు నింపింది అని తెలిపేందుకు నేను చాలా సంతోషిస్తున్నానని అన్నారు.
అనంతరం నిపుణులతో పాటు విజయవంతమైన 12 కాలేయ మార్పిడి పూర్తి అయిన వారితో
మీడియా మిత్రులు ఇంట్రాక్టివ్ సెషన్ (ముఖాముఖీ) నిర్వహించారు.