కొవ్వూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 14 న కొవ్వూరు
పర్యటన నేపథ్యంలో ముందస్తుగా సభా నిర్వహణ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగిందని
హోం మంత్రి డాక్టర్ తానేటి వనిత, జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత లు
పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి కొవ్వూరు నియోజక వర్గం లోని కొవ్వూరు, చాగల్లు
మండలాల్లో మంత్రి, కలెక్టర్, జేసీ, ఆర్ ఎం సి మునిసిపల్ కమిషనర్ లు
పర్యటించారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ఏప్రిల్ 14 న
భారతరత్న డా బి ఆర్ అంబేద్కర్ పుట్టిన రోజున కొవ్వూరు నియోజక వర్గం పరిధిలో
భారీ బహిరంగ సభ నిర్వహించనున్నా మని తెలిపారు. ఆ నేపథ్యంలో కొవ్వూరు , చాగల్లు
మండలాల్లో పలు ప్రాంతాలను కలెక్టర్ తో కలిసి పరిశీలించినట్లు తెలిపారు.
కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, కొవ్వూరు లోని యువరాజ్ ఫంక్షన్ హాలు సమీపంలో
దేచర్ల రిలయన్స్ సైట్, తహశీల్దార్ కార్యాలయం సమీపంలో ప్రాంతాలను, గోష్పాద
రేవు సమీపంలో వున్న ప్రాంతాలను పరిశీలించినట్లు తెలిపారు. ఈ పర్యటన లో
జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్,
ఆర్డీవో ఎస్. మల్లి బాబు, మాజీ ఎమ్మెల్సీ కె. శివ రామకృష్ణ, స్థానిక ప్రజా
ప్రతినిధులు పాల్గొన్నారు.