సితార సెంటర్ వద్ద స్టేడియం నిర్మాణం కాదు…టిడ్కో గృహ సముదాయం నిర్మాణం
చేయాలి
స్థానిక ఎమ్మెల్యే,కార్పొరేటర్ కు ప్రజా సమస్యలు విని పరిష్కరించే ఓపిక లేదు
జగన్ పాలన గుండెల మీద కుంపటిలా ఉంది.. దించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
విజయవాడ : సీఎం జగన్ ను ఇంటికి పంపించేందుకు బటన్ నొక్కడం మాత్రమే మిగిలి
ఉందని జన సేన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్
అన్నారు. శుక్రవారం రెండో రోజు ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వం 44వ
డివిజన్ అధ్యక్షురాలు మల్లెపు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నాలుగు స్తంభాల సెంటర్
వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం
ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
స్థానికంగా ప్రజలు మహేష్ ని చూడంగానే సమస్యలను ఏకరువు పెట్టారు. నాలుగు
స్తంభాల సెంటర్, బూస్టర్ పంప్ హౌస్ సెంటర్ ,నాగేంద్ర స్వామి పుట్ట ,నాగేంద్ర
నగర్ కొండ ప్రాంతం వరకు ఈరోజు కార్యక్రమం నిర్వహించారు.
మీడియా పాయింట్ వద్ద మహేష్ మాట్లాడుతూ సీఎం జగన్ తీసుకొచ్చిన ఇసుక పాలసీ వల్ల
పనులు లేక ఇతర ప్రాంతాలకు మగవారు వలసలు వెళ్ళిపోతున్నారని కుటుంబాలు విడిపోయి
బతకాల్సిన దుస్థితి వచ్చిందని, ఇటువంటి దుర్మార్గమైన ఇసక పాలసీ తీసుకొచ్చిన
వైఎస్సార్సీపీని మహిళలు ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని, పెన్షన్ మీద
ఆధారపడి జీవనం సాగిస్తున్న వృద్ధురాలి పెన్షన్ తొలగించినందుకు వారు కన్నీరు
మున్నీరై విలపిస్తున్నారని, చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించే
పరిస్థితి కూడా జగన్ పాలనలో లేదని, వైయస్ఆర్సీపీ పాలనను భరించలేకపోతున్నామని ఈ
గుండెల మీద కుంపటి దించుకునేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని, స్థానిక సమస్యలు
పరిష్కరించేందుకు కార్పొరేటర్ అందుబాటులో లేరని అదేవిధంగా సమస్యలు
చెప్పుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని వడ్డెర
వీధిలో ఒక స్తంభం మార్చటానికి కూడా కార్పొరేటర్ కు తీరిక లేదని విమర్శించారు.
జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ పథకం కాదని వారు
పెట్టాల్సింది ఫ్యామిలీ కిల్లర్ పథకమని బాబాయిని గొడ్డలిపోటుతో చంపించిన
వ్యక్తి ఫ్యామిలీ కిల్లర్ అవుతారని అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు
లేరని వసతులు అగమ్య గోచరంగా ఉన్నాయని వైద్యం చేయించుకునేందుకు ప్రభుత్వ
ఆసుపత్రికి వెళ్తే తిరిగి పాడేమీదే ఇంటికి తిరిగి వచ్చే పరిస్థితులు
ఎదురవుతున్నాయని, అంబులెన్సులు కూడా అందుబాటులో లేదన్నారు, అదేవిధంగా
డివిజన్లో సమస్యలు తిష్టవేశాయని ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో సమస్యల తీవ్రంగా
ఉన్నాయని మెట్ల మార్గం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అదే విధంగా
సితార సెంటర్ వద్ద స్టేడియం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నామని అక్కడ టీడ్కో
ఏళ్ల గృహ సముదాయం నిర్మించాలని మహేష్ డిమాండ్ చేశారు.
స్థానిక డివిజన్ అధ్యక్షులు మల్లెపు విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజలు సమస్యలతో
స్వాగతం పలికారని, జగన్ ని నియంత్రించడానికి మేము బటన్ నొక్కితే సరిపోతుందని
ప్రజలు చెబుతున్నారని, స్థానిక కార్పొరేటర్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత వార్డు
వైపునే చూడడం లేదని కార్పొరేటర్ కనబడడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం
చేస్తున్నారని రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పశ్చిమ నియోజకవర్గంలో
పోతిన మహేష్ కు పట్టం కట్టేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని భారీ మెజార్టీతో
గాజు గ్లాస్ మీద మహేష్ గెలుపు తధ్యమని అన్నారు. జగనన్నే మా నమ్మకం అని ప్రజలు
ఎవరు అనడం లేదని, ఇప్పటికే ఒకసారి మోసపోయామని ఇంకొకసారి నమ్మే పరిస్థితి లేదని
అటువంటి పరిస్థితి కనక వస్తే ఈ రాష్ట్రం విడిచి పక్క రాష్ట్రానికి పారిపోయే
దుస్థితి వస్తుందని ఆవేదన ప్రజల తెలియజేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో
డివిజన్ అధ్యక్షులు కొరగంజి వెంకటరమణ, బొమ్ము రాంబాబు, రెడ్డిపల్లి గంగాధర్,
తిరపతి అనూష, బత్తుల వెంకటేష్, సిగానంశెట్టి రాము, పొట్నరి శ్రీనివాసరావు,
తమ్మిన లీలా కరుణాకర్, సోమి గోవింద్, ఏలూరు సాయి శరత్, సంజీవరావు,స్టాలిన్
శంకర్, బోట్టా సాయి, తదితరులు పాల్గొన్నారు.