అనంతపురం : కమ్మూరులో బీసీ సంఘాల ప్రతినిధులతో టీడీపీ జాతీయ ప్రధాన
కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. బీసీ విద్యార్థులకు
స్కాలర్షిప్స్ రావడం లేదన, విదేశీ విద్య పథకం కూడా ఆపేశారని నారా లోకేష్
విమర్శించారు. బీసీ రెసిడెన్షియల్ హాస్టల్స్, కాలేజీలు ఏర్పాటు చేయాలని, ఫీజు
రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఫీజుల కోసం
కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని, టీడీపీ రాగానే బీసీ
రక్షణ చట్టం తెస్తామని నారా లోకేష్ మండిపడ్డారు. న్యాయపోరాట ఖర్చు కూడా
ప్రభుత్వమే భరిస్తుందని, నియోజకవర్గాల వారీగా బీసీ రెసిడెన్షియల్ కాలేజీలు
ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
ఉరవకొండ నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
పర్యటిస్తున్నారు. కూడేరు క్యాంప్ సైట్ నుంచి 62వ రోజు యువగళం పాదయాత్రను నారా
లోకేష్ తన పాదయాత్రను ప్రారంభించారు. అంతకు ముందు ఉదయాన్నే సెల్ఫీ విత్ నారా
లోకేష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వెయ్యి మందితో మొదలైన సెల్ఫీ విత్ నారా
లోకేష్ కార్యక్రమం ఇప్పుడు రెండు వేల మందికి చేరుకుంది. లోకేష్‌తో ఫోటో
దిగేందుకు ఉదయం 5.30 కే లోకేష్ క్యాంప్ సైట్‌కి పెద్ద ఎత్తున ప్రజలు
చేరుకుంటున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలు తరలివస్తున్నారు. లోకేష్‌తో
ఫోటో దిగేందుకు యువత, మహిళలు, వృద్ధులు పోటీ పడుతున్నారు. ఎంత మంది వచ్చినా
క్యూలో ఉన్న చివరి వ్యక్తి వరకూ లోకేష్ ఫోటో దిగి పంపిస్తున్నారు. సెల్ఫీ
కార్యక్రమంలోనే లోకేష్‌ను కలిసి తమ సమస్యలు తెలిపి వినతి పత్రాలు
అందజేస్తున్నారు.