వరంగల్ : పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అరెస్టయిన బీజేపీ
రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి న్యాయస్థానం ఈనెల 19 వరకు రిమాండ్
విధించింది. కమలాపూర్ ప్రభుత్వ పాఠశాల నుంచి పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం
లీకేజీ కేసులో అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు
హనుమకొండలోని నాయ్యమూర్తి నివాసంలో జడ్జి ఎదుట హాజరు పర్చారు. పోలీసుల
రిమాండ్ రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి బండి సంజయ్‌కు ఈనెల 19 వరకు
రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తన పట్ల పోలీసులు దురుసుగా
ప్రవర్తించారని ఈ సందర్భంగా బండి సంజయ్ న్యాయవాదులకు తెలిపారు. తన గాయాలను
చొక్కా విప్పి బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులకు చూపించారు. బండి సంజయ్‌ను
కాసేపట్లో ఖమ్మం జైలుకు తరలించే అవకాశముందని సమాచారం. బీజేపీ శ్రేణులు పెద్ద
ఎత్తున న్యాయమూర్తి నివాసం వద్దకు చేరుకుని న్యాయం కావాలంటూ నినదించడంతో
ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు.ఈకేసులో బండి
సంజయ్‌పై ఏ1, ప్రశాంత్ (మాజీ జర్నలిస్టు) ఏ2, గుండబోయిన మహేశ్ ఏ3 (కేఎంసీలో
ల్యాబ్ అసిస్టెంట్), మైనర్ బాలుడు ఏ4, శివగణేశ్ ఏ5, పోగు సుభాష్ ఏ6, పోగు
శశాంక్ ఏ7, పెరుమాండ్ల శ్రామిక్ ఏ9, దూలం శ్రీకాంత్ ఏ8, పెరుమాండ్ల
శ్రామిక్ ఏ9, పోతబోయిన వర్షిత్ ఏ10 నిందితుడిగా పోలీసులు రిమాండ్
రిపోర్టులో పేర్కొన్నారు.