విజయవాడ : శ్రీ దేవి కరుమారి అమ్మన్ శక్తి పీఠం వద్ద జరగనున్న సహస్త్ర చండీ
యాగానికి బుధవారం యాగశాల నిర్మాణం కోసం గణపతి పూజ, భూమి పూజ (పౌర్ణమి రోజున)
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఏ డి సి పి (క్రైమ్) వెంకటరత్నం, నగర
డిప్యూటీ మేయర్ అవుతు శైలజా రెడ్డి, 45 వ, డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్న
కుమారి పాల్గొని పూజలు నిర్వహించారు. తొలుత వీరికి శక్తి పీఠాధిపతి
శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు బృందం ఆలయ మర్యాదలతో మంగళ వాయిద్యాలతో స్వాగతం
పలికారు. ఆలయ అర్చకులు దీక్షితులు గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ సంప్రదాయం ప్రకారం శాలువాలతో సత్కరించి అమ్మవారి చీరలు బహుకరించారు.
అనంతరం యాగం ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న కళావేదిక, 72 అడుగుల మహా చండీ మట్టి
విగ్రహం ప్రత్యేకతను నిర్వాహకులు ఏ డి సి పి, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ లకు
వివరించారు. యాగశాల నిర్మాణ భూమి పూజ కోసం శ్రీ కనక దుర్గమ్మ దేవాలయం
స్థానాచార్యులు విష్ణు భట్ల శివప్రసాదు శర్మ ప్రత్యేకంగా తన శిష్య బృందంని
పంపించి శాస్త్రోక్తంగా ఈ పూజలు నిర్వహించారు.