జగ్గయ్యపేట : బాబు జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివని ప్రభుత్వ విప్ సామినేని
ఉదయభాను అన్నారు. బుధవారం స్థానిక బస్టాండ్ సమీపంలో ఉన్న బాబు జగ్జీవన్ రామ్
115వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్,జగ్గయ్యపేట
నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను ఆయన విగ్రహానికి పూలమాలవేసి
నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ అట్టడుగు వర్గాల
అభ్యున్నతి, అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం
మర్చిపోలేనిదని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఉప ప్రధాని గా దేశసేవకు
అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. 52 ఏళ్లపాటు పార్లమెంటును ఏలిన
మహా అనుభవ శీలి, వ్యవసాయ, రక్షణ, ఆరోగ్య, రైల్వేశాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా
ఆయన సేవలు అనిర్వచనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్
తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, వైస్ చైర్మన్
తుమ్మల ప్రభాకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల వెంకట చలం, యువజన విభాగం
అధ్యక్షులు ఆవాల భవాని ప్రసాద్, విజయవాడ దుర్గ గుడి డైరెక్టర్లు నంబూరి
రవి,అల్లూరి భాస్కర్,కౌన్సిలర్ పందుల రోశయ్య, ఖదర్ బాబు, నాయకులు అన్నేపాక
నరసింహారావు,అన్నేపాక రమేష్, కన్నమాల శామ్యూల్, చెరుకుమల్లి రాంబాబు,మల్లెల
సాయి, ఉప్పెలి ప్రసాద్, చారుగుండ్ల కొండ, బద్దు నయక్ తదితర ముఖ్య నాయకులు
పాల్గొన్నారు.