ముఖ్య అనుచరుడు రుద్రరాజు
విజయవాడ తో ఆయనకు విడదీయరాని బంధం
ఇప్పటికే మకాం ఎన్టీఆర్ జిల్లా లో కరెన్సీ నగర్ లో కి మార్చారు
ఏపీ రాజధాని ప్రాంతం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటికే అన్ని
నియోజకవర్గాల ప్రజలతో, నాయకులతో, కార్యకర్తలతో ముఖాముఖీ కార్యక్రమాలు
విజయవాడ : ఎన్టీఆర్ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచీ మాజీ ఎమ్మెల్సీ,
ప్రసుత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు విజయవాడ
పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీచేయడానికి సిద్ధంగా వున్నారని సమాచారం.
విజయవాడ పార్లమెంట్ పరిధి చరిత్ర తీసుకుంటే బ్రాహ్మణుల సామజిక వర్గానికి
చెందిన అత్యధికులు ప్రముఖులు విజయవాడ పార్లమెంట్ నియోజక వర్గంలో పోటీచేసి
పార్లమెంటులో అడుగుపెట్టారు. కె ఎల్ రావు లాంటి ప్రముఖులు పోటీచేసిన గడ్డమీద
మరల బ్రాహ్మణ సంతతి నుండి గిడుగు రుద్రరాజు బరిలోకి దిగటం బ్రాహ్మణుల్లో
హర్షద్వానాలు వినిపిస్తున్నాయి. అన్నివర్గాలవారికి కలుపుకుపోయే సౌమ్యుడు
గిడుగు రుద్రరాజు అని అందరు చెప్పుకుంటారు. అదే విధంగా అయన సంస్కరణలతో ఏపీలో
భారీగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. గిడుగురాకతో భారీగా కాంగ్రెస్
ఓటింగ్ శాతం పెరిగింది అనటంలో సందేహంలేదు. చిన్న కార్యక్రమానికి పిసిసి
అధ్యక్షుడు హోదా పక్కనపెట్టి హాజరవుతున్న నాయకుడు గా ఆయనకు పేరు
వుంది////గిడుగురుద్రరాజు విజయవాడ పార్లమెంట్ కు పోటీచేస్తే విజయం తథ్యం అని
రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిల్లోబ్రాహ్మణ సామజిక
వర్గం ఓట్లు అధికంగానే వున్నాయి. బ్రాహ్మణ సామాజిక వర్గానికి కాంగ్రెస్
పార్టీ న్యాయం చేసినట్లు వుంటుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది
ఏమైనప్పటికి గిడుగురుద్రరాజు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించే అవకాశాలు
వున్నాయి.