హైదరాబాద్ : పరీక్షల నిర్వహణలో ఉద్యోగులెవరూ తప్పులు చేసినా, అక్రమాలకు
పాల్పడినా ఉద్యోగాలు పోతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
హెచ్చరించారు. రాష్ట్రంలో నిన్న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలకు సంబంధించి
వరుసగా పేపర్లు బయటికి రావటంతో తెలంగాణ సర్కార్ తీవ్రంగా పరిగణించింది. ఈ
మేరకు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఇతర అధికారులతో మంత్రి సబితారెడ్డి సమీక్ష
నిర్వహించారు. ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలను
చేపట్టిందన్న మంత్రి పరీక్షల విషయంలో స్వార్ధ ప్రయోజనాల కోసం విద్యార్థుల
భవిష్యత్తో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు.