భారీగా పరిహారం పెంచడం ఒక చరిత్ర
సీఎం కేసీఆర్ రుణం తీర్చుకొలేనిది
జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డీ. మౌజం అలీ ఖాన్
హైదరాబాద్ : అడవుల సంరక్షణలో భాగంగా ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో అసాంఘిక శక్తుల
దాడుల్లో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది మరణించినా.. గాయపడినా.. వారికి పెద్ద
మొత్తంలో పరిహారం ప్రకటించడం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల
చంద్రశేఖర్ రావు అటవీ శాఖ ఉద్యోగులపై ప్రత్యేక వాత్సల్యం చూపారని, ఇది
చారిత్రాత్మమైన నిర్ణయం అని జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర
అధ్యక్షులు ఎం.డీ. మౌజం అలీ ఖాన్ అన్నారు. అటవీ శాఖ చరిత్రలో గతంలో ఎన్నడూ
లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ అటవీ శాఖ ఉద్యోగులకు భరోసాను
ఇచ్చారని మౌజం అలీ ఖాన్ తెలిపారు. అటవీ శాఖ అధికారులు, ఉద్యోగుల జీవితానికి
భరోసాను ఇచ్చి, పరిహారాన్ని భారీగా ప్రకటించిన సీఎం కేసీఆర్ కు, అందుకు
సహకరించిన అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి,
పీ.సీ.సీ.ఎఫ్. ఆర్.ఎం. డోబ్రియాల్ లకు మౌజం అలీ ఖాన్ వేలాది మంది అటవీ శాఖ
ఉద్యోగుల తరపున, సంఘం కార్యవర్గం తరపున కృతజ్ఞతలు తెలిపారు.