అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు * 7, 8 తేదీల్లో కర్నూలు, కడపలలో
పర్యటన * సిపిఐ రౌండ్ టేబుల్ సమావేశం పిలుపు * దమనకాండపై సిఎం స్పందించరా? :
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ * దళిత, మైనార్టీలకు రక్షణ కరవు :
సీపీఎం నేత మధు * మోడీ..జగన్ కు చరమగీతం : గిడుగు రుద్రరాజు డాక్టర్ అచ్చెన్న
మరణంపై జగన్ నోరు విప్పాలి : మంద కృష్ణమాదిగ * వైసీపీ హయాంలో దళితులపై వివక్ష:
మాజీ ఎంపీ హర్షకుమార్ * ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ దుర్వినియోగం : వర్ల రామయ్య
విజయవాడ : వైసిపి ప్రభుత్వంలో దళిత, మైనార్టీలపై హత్యాకాండ కొనసాగుతోందని, ఈ
అకృత్యాలను నిరసిస్తూ ఈనెల 11న (పూలే జయంతి రోజు) చలో విజయవాడ తలపెట్టాలని
సీపీఐ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి అధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్
సమావేశం పిలుపునిచ్చింది. డాక్టర్ అచ్చెన్న హత్యా ఘటనపై న్యాయపోరాటం కోసం ఈనెల
7న కర్నూలులోను, 8వ తేదీన కడపలోను పర్యటించాలని, దళిత, మైనార్టీలపై దాడులకు
వ్యతిరేకంగా 26 జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని సమావేశం
తీర్మానించింది. రాష్ట్రంలో దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులు,
అకృత్యాలను నిరసిస్తూ సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మంగళవారం
విజయవాడ దాసరి భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి
అఖిలపక్ష పార్టీలు, దళిత, మైనార్టీ, ప్రజా సంఘాల నేతలు పెద్దఎత్తున
హాజరయ్యారు. ఈ సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అధ్యక్షత
వహించి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, వైఫల్యాలను ప్రశ్నిస్తే
దాడులు చేస్తారా?, ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రశ్నించకూడదా?, యువతులపై
అఘాయిత్యాలు, హత్యలు జరిగినా సీఎం జగన్ ఎందుకు మాట్లాడరు?. జగన్ ఏమైనా పై
నుంచి ఊడి పడ్డారా? అని నిలదీశారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడిని
చంపి డోర్ డెలివరీ చేశారని, ఆ తర్వాత అతడు బెయిల్పై వచ్చినప్పుడు ఆ పార్టీ
వాళ్లే స్వాగతం పలికి సన్మానాలు చేస్తారా?. ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు, బయటకి
వస్తే దండలు వేస్తారా?. ఇదేనా జగన్ దళితులపై మీకున్న ప్రేమ అంటూ ధ్వజమెత్తారు.
కనీసం సిగ్గు కూడా లేకుండా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని, అమాయక యువతులను
రేప్ చేసి చంపితే దోషులకు శిక్షలు లేవన్నారు. అసలు రాష్ట్రంలో పోలీసులు
ఉన్నారా?. అసలు పని చేస్తున్నారా? అని నిలదీశారు. అధికార మదంతో ఉన్న వైసీపీకి
బుద్ధి చెప్పాలని, ఇంత దుర్మార్గమైన పాలన నా జీవితంలో చూడలేదన్నారు. అన్ని
సంఘాలు కలిసి ఐక్య కార్యాచరణకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా
రాష్ట్రంలో దళిత, మైనార్టీలపై జరుగుతున్న దాడులపై సీఎం జగన్ స్పందించి చర్యలు
తీసుకుంటామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ, సీపీఎం జాతీయ కమిటీ
సభ్యులు పి.మధు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళిత,
మైనార్టీ, వెనుకబడిన వర్గాలపై రక్షణ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో
దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటూ సీఎంకు లేఖ రాసి ఆరు నెలలు గడిచినా
స్పందించలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీలో జాప్యం
చేస్తున్నారని, పోలీస్ రాజ్యం నడుస్తోందని, పోలీస్ అండతో నియోజకవర్గానికో
సామంతరాజు తయారయ్యారని మండిపడ్డారు. కేంద్రం నుంచి వెనుకబడిన వర్గాలకు
అందాల్సిన ఫలాల్లో కోతలు పెడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించకుండా
మిన్నకుండిపోయిందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎప్పుడూ ఆయన తన విగ్రహం 125
అడుగులు ఎత్తు కట్టాలని కోరుకోలేదని, దళిత, వెనుకబడిన వర్గాల ప్రజలు అభివృద్ధి
చెందాలని కోరుకున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వం వెంటనే దళిత సంఘాలను పిలిచి
సమావేశ పరిచి దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలని, జస్టిస్ పున్నయ్య కమిషన్
సిఫార్సులు అమలు చేయాలన్నారు. డీజీపీ ఆయన హోదాకు తగ్గట్టుగా వ్యవహరిండంలేదని,
పోలీస్ అండతో దాడులు చేస్తున్నా చర్యలు లేవన్నారు. రాష్ట్ర కాంగ్రెస్
అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ దేశంతోపాటు రాష్ట్రంలోనూ దళిత,
మైనార్టీలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. హత్యలు, అత్యాచారాలు
కేసులలో దేశంలో రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందని, ఇన్ని దారుణాలు
జరుగుతున్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. పోలీసులు అక్రమార్కులకే
కొమ్ము కాయడం బాధాకరమని, మళ్లీ మోడీ , జగన్ అధికారంలోకి రాకూడదని ప్రజలు
కోరుకుంటున్నారన్నారు. ఈ దారుణాలతో సమాజం ఎటు పోతుందనే ఆవేదన కలుగుతోందని,
హైకోర్టు జడ్జి నుంచి సామాన్యుల వరకు ఎవర్నీ వదలడం లేదని, మన భవిష్యత్తు తరాల
కోసం అయినా అందరూ నడుం కట్టాలని పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు
మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ రాష్ట్రంతోపాటు దేశంలోనూ దళితులు, మైనార్టీలు
దాడులు, అత్యాచారాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కులమతాలకు
అతీతంగా ఎవరికి అన్యాయం జరిగినా ఖండించాల్సిందేనన్నారు. అనాది నుంచి దళితుల
పట్ల వామపక్ష పార్టీలు అండగా నిలిచి పోరాటం చేస్తున్నాయని ప్రశంసించారు. దిశ
ఘటనలో నిందితులు ఎన్ కౌంటర్ ను అసెంబ్లీలో సీఎం జగన్ సమర్థించి, దిశ పేరుతో
చట్టం తెచ్చారని గుర్తుచేశారు. జగన్ అన్ని వర్గాల అమ్మాయిలకు జరిగిన అన్యాయంపై
అలానే స్పందిస్తారా?. మైనార్టీలపై జగన్ కపట ప్రేమ పోషిస్తున్నారంటూ
దుయ్యబట్టారు. కడప జిల్లాకు చెందిన డాక్టర్ అచ్చెన్న, అనంతపురం జిల్లాలో దళిత
యువత హత్యలపై ప్రభుత్వం నోరు విప్పాలని డిమాండ్ చేశారు. చలో విజయవాడకు
ఎంఆర్పీఎస్ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. మాజీ ఎంపీ జి.హర్షకుమార్
మాట్లాడుతూ వైసీపీ హయాంలో దళితులపై వివక్ష పెరిగిపోయిందన్నారు. దళితులకు
అమలవుతున్న అనేక పథకాలు రద్దు చేశారని, ఎస్సీ కార్పొరేషన్ నిధులు మళ్లించి
నిర్వీర్యం చేశారన్నారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నా ఒక్కరికీ అధికారం
లేదని, ఒక్క మంత్రి కూడా తన శాఖపై ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టిన పాపాన
పోలేదన్నారు.