న్యూఢిల్లీ : వితరణ శీలి, కళా సేకరణకర్త కిరణ్ నాడార్కు ఇటీవల ఫ్రాన్స్
అత్యున్నత పౌర పురస్కారాన్ని భారత్లో ఫ్రెంచ్ రాయబారి ఎమ్మాన్యుయెల్
లెనైన్ ప్రదానం చేశారు. కళా రంగంలో ఆమె చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా,
జాతీయంగా, అంతర్జాతీయంగా సాంస్కృతిక రంగంలో అందరికీ అవకాశాలు కల్పించాలన్న ఆమె
నిబద్ధతకు, భారత్, ఫ్రాన్స్ సాంస్కృతిక సంబంధాల పెంపులో నాయకత్వ పాత్ర
పోషించినందుకు ఈ అత్యున్నత అవార్డును ప్రదానం చేశారు. కిరణ్ నాడార్ ఆర్ట్
మ్యూజియం ఛైర్పర్సన్గా వున్న ఆమె శివ నాడార్ ఫౌండేషన్ ట్రస్టీగా వున్నారు.
రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను, కళా సహకారాన్ని మరింత ముందుకు
తీసుకెళ్లేందుకు ఈ ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తుంది.