మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుత విజయం సాధించింది. ముంబై
ఇండియన్స్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 2 వికెట్లు కోల్పోయి
మాత్రమే ఛేదించింది. కోహ్లీ(49 బంతుల్లో 82 నాటౌట్), ఫాఫ్ డుప్లెసిస్ (43
బంతుల్లో 73) మొదటి వికెట్‌కు ఏకంగా 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఇంకా
22 బంతులు ఉండగానే విజయాన్ని అందుకుంది బెంగళూరు. ఇక తన ఫామ్‌ను కొనసాగిస్తూ
ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు విరాట్. మొత్తం 6 ఫోర్లు, 5 సిక్స్‌లు సహాయంతో
82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో మరికొన్ని రికార్డులను తన
ఖాతాలో వేసుకున్నాడు కింగ్ కోహ్లీ. ఈ మ్యాచ్‌లో అతను కేవలం 38 బంతుల్లోనే హాఫ్
సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 50+ పరుగులు
చేసిన 2వ ఆటగాడిగా నిలిచాడు.
అలాగే కింగ్ కోహ్లి 50+ స్కోర్ల విషయంలో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
ఐపీఎల్లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 45 అర్ధ సెంచరీలు చేశాడు. 5 సెంచరీలు కూడా
చేశాడు. అంటూ అతను మొత్తం 50 సార్లు 50కు పైగా పరుగులు చేశాడు. ఈ జాబితాలో
డేవిడ్ వార్నర్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను ఐపీఎల్లో 60 సార్లు 50+ స్కోర్లు
చేశాడు. అలాగే శిఖర్ ధావన్ 49 సార్లు, ఏబీ డివిలియర్స్ 43 సార్లు 50కు పైగా
పరుగులు చేసి 3, 4 స్థానాల్లో నిలిచారు.ఇక ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్
శర్మ 41 సార్లు 50+ స్కోర్లు చేయడం ద్వారా ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు.
ఈ రికార్డుతో పాటు ఆర్సీబీ ఓపెనర్‌గా3 వేల రన్స్ పూర్తి చేశాడు
కోహ్లీ. ఇప్పటివరకు మొత్తం 224 ఐపీఎల్ మ్యాచులు ఆడిన విరాట్ 6,706 పరుగులు
చేశాడు. ఇందులో 45 సెంచరీలు, 5 సెంచరీలు ఉన్నాయి. ఆరంభ మ్యాచుల్లోనే
రికార్డులు ఎక్కుపెట్టిన విరాట్ కోహ్లీ రాబోయే మ్యాచుల్లో మరెన్ని ఘనతలు
అందుకుంటాడో చూడాలి మరి.