250 మంది ప్రయాణిస్తున్న ఓడలో మంటలు చెలరేగడం వల్ల 31 మంది మరణించారు. ఈ ఘటన
దక్షిణ ఫిలిప్పీన్స్‌లో జరిగింది. మరోవైపు, థాయ్‌లాండ్‌లోని బ్యాంకాంక్ సమీపంలో
కార్చిచ్చు చెలరేగింది. అడవిలో మంటల కారణంగా వ్యాపించిన దట్టమైన పొగకు వాహనాలు
ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫిలిప్పీన్స్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 250
మంది ప్రయాణిస్తున్న ఓడలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 31 మంది
మరణించారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. అగ్నిప్రమాదంలో సుమారు 23 మంది
ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రావిన్స్‌లో జరిగింది.
“జాంబోంగా నుంచి సులు ప్రావిన్స్‌లోని జోలీ పట్టణానికి ఓడ వెళ్తుండగా
అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్నారు. మంటల
కారణంగా భయాందోళనలకు లోనై నీటిలో పడి కొందరు అగ్నికీలల్లో చిక్కుకుని
మరికొందరు మరణించారు. దగ్ధమైన ఓడను బాసిలన్ తీరానికి అధికారులు చేర్చారు. ఓడ
క్యాబిన్‌లోనే 18 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన ఏడుగురి కోసం గాలింపు
చర్యలు జరుగుతున్నాయి. గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించి చికిత్స
అందిస్తున్నాం. ఘటనపై పూర్తి దర్యాప్తు చేపడుతున్నామని ప్రావిన్స్ గవర్నర్
జిమ్ హతమన్ తెలిపారు.