ప్రపంచంలో ఇటీవల కాలంలో గంజాయి వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా కళాశాలలలో
కూడా గంజాయి వినియోగం పెరిగిపోయింది. అయితే కౌమార దశలో గంజాయి తీసుకోవడం వల్ల
తప్పవని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు చెబుతున్నారు. టాక్సీ
లాజికల్ సైన్సెస్ పేరుతో వెలువడుతున్న ఆన్లైన్ జర్నల్లో ఈ వివరాలు
ప్రచురితమయ్యాయి .మహిళలు అందులోనూ… యువతులు గంజాయిని వినియోగించడం వల్ల వారు
గర్భం ధరించే సామర్థ్యం పై ప్రతికూల ప్రభావాలు ఉంటాయని ఈ పరిశోధనలు
తెలుపుతున్నాయి. ఎక్కువ మంది యువకులు , యువతులు గంజాయిని ఉపయోగిస్తున్నారని.,
దీనివల్లనే పునరుత్పత్తి వ్యవస్థ పై తీవ్రమైన ప్రభావం పడుతుందని వెల్లడించారు.
2019లో జరిపిన ఈ సర్వే ఆధారంగా 12 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల 3.3 మిలియన్ల
మంది గంజాయి వినియోగిస్తున్నట్టు తేలింది. వీరందరికీ కూడా పునరుత్పత్తికి
సంబంధించిన చిక్కులు తప్పవని కాలిఫోర్నియా యూనివర్సిటీ వైద్యులు
హెచ్చరిస్తున్నారు. ఈ అంశాన్ని ప్రకటించడానికి ముందు పరిశోధకులు ఎలుకలలో
ప్రయోగాలు చేశారు. ఎలుకలలో గంజాయిని పంపించడం ద్వారా వాటి పునరుత్పత్తి
వ్యవస్థ దెబ్బతిన్నట్టు గుర్తించారు . గంజాయి వల్ల అండాశయ ఫోలికల్స్ సంఖ్య
దాదాపు 50 శాతం తగ్గిందని వారు కనుగొన్నారు. ఇదే పరిస్థితి మహిళలకు తప్పదని
హెచ్చరిస్తున్నారు.