న్యూఢిల్లీ : దేశంలో సుప్రసిద్ధ చారిత్రాత్మక, సాంస్కృతిక, మతపరమైన ప్రదేశాలకు
కలుపుతూ ప్రపంచదేశాల్లోనే గొప్పదైన భారతదేశ సంస్కృతి వారసత్వాన్ని పర్యాటకులకు
చూపించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ “భారత్ గౌరవ్ ట్రైన్స్” ఏర్పాటు చేయడం
అత్యంత ప్రశంసనీయమని, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారత్ గౌరవ్
ట్రైన్స్ ద్వారా పర్యాటక రంగం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని రాజ్యసభ సభ్యులు,
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్
వేదికగా బుధవారం ఆయన పలు అంశాలు వెల్లడించారు. దక్షిణ భారతదేశానికి చెందిన
లక్ష్మణ్ నరసింహన్ స్టార్ బక్స్ సీఈఓగా నియమితులవ్వడం భారతీయులందరికీ
గర్వకారణమని అన్నారు. కాఫీ చైన్ నిర్వహించడంలో దక్షిణ భారతదేశానికి చెందిన
వ్యక్తులు అత్యంత సమర్దవంతులని ఆయన అన్నారు. భారత రాయబార కార్యాలయాలు,
దౌత్యవేత్తల పై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానని విజయసాయి రెడ్డి
అన్నారు. యూకే, యూఎస్ పోలీసు అధికారులు ఈ చర్యలు తీవ్రంగా పరిగణించి దాడులకు
పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భారత
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ ఆధ్వర్యంలో ఎంఈఏ (మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్
టర్నల్ ఏఫైర్స్) సమర్థవంతమైన చర్యలు చేపట్టగలరని బలంగా నమ్ముతున్నానని
అన్నారు.news description