భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్లు ప్రపంచంలో ఏ మూల మ్యాచ్ ఆడినా స్టేడియం హౌస్
ఫుల్ అవ్వాల్సిందే. అయితే, ఇరుజట్ల మధ్య 2012-13 సీజన్ నుంచి ద్వైపాక్షిక
సిరీస్ లు నిలిచిపోయాయి. ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్ టోర్నీలో మాత్రమే భారత్,
పాక్ తలపడుతున్నాయి.
ఫుల్ అవ్వాల్సిందే. అయితే, ఇరుజట్ల మధ్య 2012-13 సీజన్ నుంచి ద్వైపాక్షిక
సిరీస్ లు నిలిచిపోయాయి. ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్ టోర్నీలో మాత్రమే భారత్,
పాక్ తలపడుతున్నాయి.
ఇరుజట్ల మధ్య చివరగా 2007లో టెస్టు మ్యాచ్ జరిగింది. భారత్, పాక్ మధ్య
ద్వైపాక్షిక సిరీస్ లు నిలిచిపోవడానికి ఉగ్రవాదం, రాజకీయ పరమైన అంశాలే కారణమని
తెలిసిందే.
ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీ స్పందించాడు. భారత్,
పాక్ జట్ల మధ్య మళ్లీ మ్యాచ్ లు జరిగేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం
చేసుకోవాలని అఫ్రిది కోరాడు. దాయాదుల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరిగేలా
చూడాలని మోదీకి విజ్ఞప్తి చేశాడు.