తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ ఎన్నో వైవిధ్యమైన
పాత్రల్లో నటించి మెప్పించిని దిగ్గజ నటుల్లో ఒకరు కోట శ్రీనివాసరావు. ఈయన
వృద్ధాప్య కారణాల రీత్యా ఇటీవల సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో
ఆయన గురించి ఓ విషాదబరితమైన వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. కోట
శ్రీనివాసరావు చనిపోయారన్నది ఆ వార్త సారాంశం. అయితే, ఈ దీనిపై కోట
స్పందించారు. తాను ఆర్యోగంగానే ఉన్నానని, వదంతులు నమ్మొద్దని కోరారు.
‘నేను మృతి చెందినట్లు సోషల్ మీడియాలో కొందరు ప్రచారం
చేస్తున్నారు. నా ఆరోగ్యం విషమించిందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని
వస్తున్న వార్తలన్నీ అసత్యాలే. నేను ఆరోగ్యంగానే ఉన్నా. వాస్తవాలు
తెలుసుకోకుండా ఇలా ప్రచరాం చేయడం భావ్యం కాదు. ఈ వార్తలు చూసి నా కుటుంబ
సభ్యులు, బంధువులు, మిత్రులు కలత చెందారు. అంతా ఫోన్లు చేసి పరామర్శించడం చాలా
ఇబ్బంది కలిగించింది. వదంతులు నమ్మొద్దు. ఇలా తప్పుడు ప్రచారాలు చేసేవారిపై
కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నన్నారు. నన్ను 40 సంవత్సరాల నుంచి ఓ
కళాకారుడిగా ప్రేక్షకులు పోషిస్తున్నారు. 70 ఏండ్లు వచ్చాయి. అయినా, నా
అదృష్టం కొద్దీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలేం లేవు. బతికున్న నన్ను చంపెయ్యకండి’
అంటూ కోట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.