న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత మూడోసారి
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరయ్యారు. విచారణకు ఆమె రావడం
వరుసగా ఇది రెండోసారి. సోమవారం 10 గంటలపాటు విచారించిన ఈడీ మంగళవారం కూడా
రావాలని కోరడంతో కవిత విచారణకు హాజరయ్యారు. ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు
ఆమె తన పాత మొబైళ్లను మీడియా ఎదుట ప్రదర్శించారు. కవర్లలో వాటిని
తీసుకెళ్తున్నట్లు చూపించారు. 10 మొబైళ్లను కవిత వినియోగించారని
ఛార్జ్షీట్లో ఈడీ పేర్కొన్న నేపథ్యంలో విచారణకు ఆమె తన పాత ఫోన్లను
తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున
పోలీసులను మోహరించారు. దీంతో పాటు ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసం వద్దకు
భారీగా భారాస కార్యకర్తలు చేరుకున్నారు.

10 ఫోన్లను జమ చేస్తున్నా: ఈడీ అధికారికి కవిత లేఖ
తాను ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని కవిత తెలిపారు. ఈ మేరకు ఈడీ
అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్రకు ఆమె లేఖ రాశారు. ఈడీ ఆరోపించిన తన 10
ఫోన్లను ఐఎంఈఐ నంబర్లతో సహా జమ చేస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. ఒక మహిళ
స్వేచ్ఛకు భంగం కలిగించేలా తన మొబైల్ ఫోన్లను కోరారని, అయినా తాను ఉపయోగించిన
అన్ని ఫోన్లు జమ చేస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తునకు సంబంధించిన వాస్తవ
విరుద్ధమైన అంశాలను మీడియాకు ఇస్తున్నారని లేఖలో కవిత ఆరోపించారు.