కన్నుమూసిన సంగతి తెలిసిందే. కుప్పంలో టీడీపీ పాదయాత్రలో పాల్గొన్న సందర్భంగా
గుండెపోటుకు గురైన తారకరత్న.. కొన్ని రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ
చివరకు ఫిబ్రవరి 18న మరణించారు. అయితే, తారకరత్నకు బాబాయ్ బాలయ్యతో అనుబంధం
ఎక్కువ. తన ప్రతి కష్టంలోనూ బాలయ్యనే అండగా ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స
పొందుతున్నప్పుడు తనే దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. అయినప్పటికీ తారకరత్నను
దక్కించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే అతని జ్ఞాపకార్థంగా ఉచిత వైద్య సేవలు
అందించేందుకు సిద్ధమయ్యారు.
బాలయ్య నటుడిగానే కాక ‘బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్’కు చైర్మన్గా
వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ హాస్పిటల్లోని ఒక బ్లాక్
పేరును ‘తారకరత్న బ్లాక్’గా మార్చారట. అంతేకాదు హృద్రోగ సమస్యలతో బాధపడే
రోగులకు ఇక్కడ ఉచిత వైద్య సేవలు కల్పించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇక
ఈ న్యూస్ నెట్టింట వైరల్ కాగా.. బాలయ్య మంచి మనసును నెటిజన్లు, ఫ్యాన్స్
ప్రశంసిస్తున్నారు. ‘మా బాలయ్య బంగారం’ అంటూ పొగిడేస్తున్నారు.
ఇదిలా ఉంటే, తారకరత్న మరణించి నెల రోజులు గడిచిపోయాయి. ఈ మేరకు ఆయన వైఫ్
అలేఖ్య రెడ్డి ఇటీవలే ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. తమ
పరిచయం, ప్రేమ, పెళ్లి నుంచి.. జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను వివరించింది.
పెళ్లి తర్వాత తాము వివక్షకు గురయ్యామని కూడా చెప్పిన అలేఖ్య రెడ్డి.. సొంత
మనుషుల వల్ల బాధింపబడినట్లు ఈ సందర్భంగా చెప్పుకొంది. అంతేకాదు అన్ని బాధలను
తారకరత్న ఒక్కడే చివరి వరకు గుండెల్లో మోశాడని, తనను ఎవరూ అర్థం
చేసుకోలేకపోయారంటూ విచారం వ్యక్తం చేసింది.