కవిత హాజరయ్యారు. కవితతో పాటు ఈడీ కార్యాలయానికి భర్త అనిల్, న్యాయవాది భరత్,
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు.
ఢిల్లీ మద్యం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో మరోసారి ఈడీ
ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరు అవుతారా లేదా అనే విషయంపై క్లారిటీ
వచ్చింది. కవిత రెండో సారి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆమె వెంట ఈడీ
కార్యలయానికి భర్త అనిల్, న్యాయవాది భరత్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెళ్లారు.
ఎమ్మెల్సీ కవితతో పాటు.. మంత్రి కేటీఆర్, భర్త అనిల్, ఎంపీలు సంతోష్,
వద్దిరాజు రవిచంద్ర, అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ప్రత్యేక విమానంలో
హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లారు. ఇక కవిత ఈ నెల 16వ తేదీన ఈడీ ముందు
హాజరుకావాల్సి ఉంది. అయితే తన ప్రతినిధి న్యాయవాది భరత్‌ను మాత్రమే ఈడీ
ఆఫీస్‌కు పంపారు. తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ నెల 24న సుప్రీంకోర్టు
విచారించనుందని,bఈ నేపథ్యంలో తదుపరి ఆర్డర్స్ వచ్చే వరకు వేచి చూడాలని ఈడీకి
లేఖ పంపారు. కానీ ఈడీ మాత్రం ఆమెకు 20న హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ఆమె సోమవారం ఈడీ ముంగిట హాజరయ్యారు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న
ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా, అరుణ్ రామచంద్రపిళ్లైలతో కవితను
కూడా కలిపి విచారిస్తారని సమాచారం.
సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్
విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
సుప్రీంను ఆశ్రయించారు. ఒక మహిళను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్
డైరెక్టరేట్ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేశారు
కవిత. తమకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని, కానీ
అలా చేయలేదని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకు విన్నవించారు.
ఆమె పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది సీజేఐ ధర్మాసనం. దీనిపై మధ్యంతర
ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. అదే విధంగా ఈనెల 24వ తేదీన
వాదనలు వింటామని సీజేఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్
పెండింగ్‌లో ఉండటంతో ఈనెల 16న ఈడీ విచారణకు కవిత హాజరు కాలేదని తెలుస్తోంది.
ఇక మార్చి 11న కవితను 8 గంటలపాటు ఈడీ విచారించిన విషయం తెలిసిందే. అయితే ఈనెల
16న మరోసారి విచారణకు హాజరవ్వాలని అదే రోజున నోటీసులిచ్చింది ఈడీ. అయితే తాను
హాజరుకాలేనని ఈడీకి ఈ మెయిల్ ద్వారా కవిత లేఖను పంపి తన ప్రతినిధిని ఈడీ
కార్యాలయానికి పంపారు. ఇక ఈ క్రమంలో మరోసారి ఈడీ ముందుకు కవిత హాజరు కావడంతో
దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.