న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి నోటీసులు అందుకున్న తెలంగాణ
ఎమ్మెల్సీ కవిత సోమవారం విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న కవిత,
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కు వచ్చారు. లిక్కర్ స్కాం కేసుకు
సంబంధించి ఈ నెల 20న విచారణకు రమ్మంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ
అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 16 విచారణకు ఎమ్మెల్సీ
హాజరుకాలేదు. చివరి నిమిషంలో అనారోగ్య కారణాలతో పాటు, విచారణపై సుప్రీం
కోర్టులో తన పిటిషన్ పెండింగ్ లో ఉందని ఈడీ అధికారులకు సమాచారం అందించారు.
అయితే, ఈడీ అధికారులు మాత్రం ఈ నెల 20న విచారణకు రావాల్సిందేనని మరోమారు
నోటీసులు జారీ చేశారు. ఈడీ నోటీసుల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత శనివారం ఢిల్లీ
వెళ్లారు. తెలంగాణ మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ లతో కలిసి ప్రత్యేక విమానంలో
శనివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఈడీ విచారణకు హాజరవుతారా లేదా
అనేదానిపై స్పష్టత లేదు. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ సూచనల మేరకే
ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈడీ విచారణలో పలు
మినహాయింపులు కోరుతూ సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఈడీ కూడా
స్పందించింది. సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.