ఖలిస్థానీ అనుకూల ‘వారీస్ పంజాబ్ దే’ అధినేత అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్
పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అమృత్‌పాల్‌ను పరారీలో ఉన్న నిందితుడిగా
ప్రకటించారు పోలీసులు. సోమవారం మధ్యాహ్నం వరకు పంజాబ్‌లో ఇంటర్నెట్ సేవలను
తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ అధినేత అమృత్‌పాల్ సింగ్ కోసం
పంజాబ్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడిని పరారీలో ఉన్న
నిందితుడిగా పోలీసులు ప్రకటించారు. అమృత్‌పాల్ స్వస్థలమైన అమృత్‌సర్‌లోని
జల్లుపుర్ ఖేరాలో అతడి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు
రాష్ట్రంలో సోమవారం మధ్యాహ్నం వరకు ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా
నిలిపివేస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం
మధ్యాహ్నం వరకు సేవలు నిలిపివేత ఉండగా దాన్ని సోమవారం మధ్యాహ్నం వరకు
పొడగించింది. బ్యాంకింగ్, వైద్యం, ఇతర అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా
ఉండేందుకు బ్రాడ్‌బ్యాండ్ సేవలను నిలిపివేయడం లేదని పేర్కొంది. ప్రస్తుతం యావత్
పంజాబ్ రాష్ట్రం పోలీసు పహారాలో ఉంది. ‘అమృతపాల్ సింగ్ ప్రస్తుతం పరారీలో
ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నాం. త్వరలోనే అతడిని
అరెస్ట్ చేస్తాం. అమృత్‌పాల్‌కు చెందిన రెండు వాహనాలను సీజ్ చేశాం. అలాగే భారీగా
ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నాం’ అని జలంధర్ పోలీస్ కమిషనర్ కుల్దీప్
సిన్హా చాహల్ అన్నారు.