ఆచరించి చెబుతున్నాడు. అతను ప్రస్తుతం UK లో మాస్టర్స్ ప్రోగ్రాంను
అభ్యసిస్తున్నాడు. అవ్జిత్ చాలా తీవ్రమైన జీవనశైలిని కలిగి ఉంటాడు. అతను
పగటిపూట కాలేజీకి హాజరవుతాడు. కళాశాల తర్వాత పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తాడు.
ఇక తాను ఆహారం కోసం బయట హోటల్స్ పై ఆధార పడాల్సిందే.. అయితే అందువల్ల బరువు
బాగా పెరిగాడు
. అతనికి పోషకాహార ప్రణాళికలేదు.ఏది దొరికితే అది తినేయడం చేసేవాడు.
తద్వారా 26 ఏళ్ల వయసులోనే అతను 85 నుంచి 105 కిలోలకు బరువు పెరిగాడు. దీంతో
తన వైద్యనిపుణులు తన సొంత భోజనాన్ని తానే సిద్ధం చేసుకోమని సలహా ఇచ్చారు.
అవిజిత్ ఆసక్తిగల సంగీత ప్రేమికుడు కాబట్టి అతను తన అభిమాన సంగీతం వింటూ నడక
కోసం వెళ్ళాలని డాక్టర్లు ప్రోత్సహించారు . ఇది అద్భుతంగా పనిచేసింది. అతను
తన మ్యూజిక్ వింటూ నడక ప్రారంభించాడు. ఫలితాల ఆశాజనకంగా వచ్చాయి. అతను
బరువు తగ్గాడు. ఈ ప్రక్రియ అంతా ఎలా జరిగిందంటే మొట్టమొదటగా ఫాస్ట్ ఫుడ్ మీద
ఆధారపడటాన్ని తగ్గించడం .,అతనే భోజనం వండడానికి ప్రోత్సహించడం. ,అతనితో కొన్ని
సులభమైన వంటకాలను పంచుకోవడం ద్వారా ఇది జరిగింది. అలాగే, సాయంత్రం ఖాళీ సమయం
లో అంటే., పోస్ట్-డిన్నర్ తర్వాత తన అభిమాన సంగీతాన్ని వింటూ నడక కోసం
వెళ్ళడం అలవాటు చేసుకున్నాడు. దీంతో బరువు గణనీయంగా తగ్గాడు. ఇలా అతని
జీర్ణక్రియ కూడా సాఫీగా సాగి., బరువుతగ్గడం ప్రారంభమైంది.