కలుషితమైన గాలి వల్ల పెద్దలకే కాదు., చిన్న పిల్లలకు కూడా చాలా ప్రమాదకరమని
అధ్యయనాలు చెబుతున్నాయి .ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్విరాన్మెంటల్ హెల్త్ అధిపతి
డాక్టర్ మరియా మీరా ఈ అంశంలో పరిశోధన చేసి వాస్తవాలను తెలియజేశారు.
కలుషితమైనటువంటి గాలి వల్ల గర్భిణీ స్త్రీలలో తీవ్రమైన ప్రభావాలు ఉంటాయని ఈ
పరిశోధనలు చెబుతున్నాయి. నెలలు నిండకుండానే పిల్లల్ని ప్రసవించే ప్రమాదం ఉందని
., అలాగే తక్కువ బరువు ఉన్న పిల్లలు పుట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు .
వాయు కాలుష్యం అనేది న్యూరో డెవలప్మెంట్ – అంటే నరాల అభివృద్ధిని కూడా
దెబ్బతీస్తుందట . అలాగే ఉబ్బసం లాంటి వ్యాధులనూ.,బాల్యంలో క్యాన్సర్ కు
కారకమవుతుందట. ఎక్కువ మోతాదులో వాయు కాలుష్యం వల్ల చిన్న పిల్లలకు తీవ్రమైన
వ్యాధులు, అలాగే హృదయ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని
హెచ్చరిస్తున్నారు.
వాయు కాలుష్యం అనేది చిన్నపిల్లల మెదడును కూడా దెబ్బతీస్తుందట. వారి
ఆరోగ్యాన్ని కూడా బలహీన పరుస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు
హెచ్చరిస్తున్నారు .ఈ గాలి కాలుష్యం అనేది చిన్నపిల్లల్లో మానసికమైన వ్యాధులకు
కారకం అవుతుందని .,అలాగే ఎముకల అభివృద్ధిని కూడా నిలువరిస్తోందని
చెబుతున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల పనితీరును దెబ్బతీస్తోందట.
ప్రపంచవ్యాప్తంగా 15 సంవత్సరాలు కంటే తక్కువ వయస్సు ఉన్న 93% మంది పిల్లలు
వాయు కాలుష్యానికి గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు
చెబుతున్నాయి. ఐదు సంవత్సరాలు కంటే తక్కువ వయస్సున్న 630 మిలియన్ల మంది
పిల్లలు వాయు కాలుష్యం వల్ల రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డబ్ల్యూహెచ్ఓ
నివేదిక చెబుతోంది. అధిక ఆదాయం ఉన్న దేశాల్లో అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో
ఐదేళ్ల లోపు వయస్సు ఉన్నటువంటి పిల్లలలో 52 శాతం మంది వాయు కాలుష్యానికి
ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట . ప్రపంచంలో దాదాపుగా 40 శాతం మంది 15 ఏళ్ల లోపు
పిల్లలు వాయు కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారట . తమ సొంత
ఇంటిలోనే వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటున్న సందర్భాలు చూస్తే ముఖ్యంగా వంట
చేస్తున్న సందర్భంగా కాలుష్యం వస్తోందట. అలాగే కొన్ని ఇంధనాలను వినియోగించడం
వల్ల కూడా కాలుష్యం వస్తుందని చెప్తున్నారు. మొత్తం మీద ప్రపంచంలో 90 శాతం
మంది పిల్లలు వాయు కాలుష్యానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాత్రం వాస్తవం.