బైడెన్ సర్కారు ప్రకటన
స్టట్గార్ట్ : ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే ఉప్పు-నిప్పుగా ఉన్న
రష్యా-అమెరికా సంబంధాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నల్లసముద్రంపై
ఎగురుతున్న అమెరికా ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌ను రష్యా యుద్ధ విమానం
ఢీకొట్టింది. దీంతో డ్రోన్ ప్రొపెల్లర్ ధ్వంసమైంది. ఈ పరిస్థితుల్లో తమ
డ్రోన్‌ను అంతర్జాతీయ జలాల్లో కూల్చేయాల్సి వచ్చిందని అమెరికా ప్రకటించింది.
‘‘నల్లసముద్రంలో అంతర్జాతీయ జలాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మా డ్రోన్‌ను
రష్యాకు చెందిన రెండు సుఖోయ్-27 యుద్ధ విమానాలు ప్రమాదకరంగా, తగనిరీతిలో
అడ్డుకున్నాయి. అందులో ఓ యుద్ధవిమానం మా డ్రోన్ ప్రొపెల్లర్‌ను ఢీకొట్టింది.
అంతకు ముందు ఎంక్యూ-9 డ్రోన్ ముందు సుఖోయ్‌లు పలుమార్లు ఇంధనాన్ని
కుమ్మరించాయని అమెరికాకు చెందిన యూరోపియన్ కమాండ్ ఓ ప్రకటనలో వివరించింది.