విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ ప్రతిభతో సచిన్ ను అధిగమిస్తారా… ఏమో కొందరు
క్రికెటర్ల కామెంట్స్ అలానే ఉన్నాయి. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్లో జరిగిన
చివరి టెస్టులో భారీ సెంచరీ (186) సాధించిన కోహ్లీ తన టెస్టు సెంచరీల సంఖ్యను
28కి పెంచుకున్నాడు. 34 ఏళ్ల కోహ్లీ దాదాపు మూడేళ్ల తర్వాత సెంచరీ సాధించి
పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్
హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ త్వరలోనే
సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డును తుడిచిపెట్టేస్తాడని
జోస్యం చెప్పాడు. నిజానికి కోహ్లీ ., అవలీలగా సచిన్ సెంచరీల కంటే ఎక్కువే
చేస్తాడని అన్నాడు. కోహ్లీ వయసు 34 ఏళ్లు అయినా ఫిట్నెస్ పరంగా 24 ఏళ్ల
కుర్రాడిలా ఉన్నాడని, దీనికి తోడు అతడి ఖాతాలో ఇప్పటికే 75 సెంచరీలు ఉన్నాయని
అన్నాడు. ఈ లెక్కన చూసుకుంటే కోహ్లీ మరో 50 సెంచరీలు చేయగలడని భావిస్తున్నట్టు
చెప్పాడు. ఈ విషయంలో తనది ఎంతమాత్రమూ అతి విశ్వాసం కాదని నొక్కిచెప్పాడు.
సచిన్ రికార్డును బద్దలుగొట్టే క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా
కోహ్లీయేనని భజ్జీ నొక్కి వక్కాణించాడు.