కాఠ్మాండూ : నేపాల్ నూతన అధ్యక్షుడిగా నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన
రామ్‌చంద్ర పౌడెల్ ఎన్నికయ్యారు. ప్రధాని పుష్పకమాల్ దహాల్ ప్రచండ
నేతృత్వంలోని 8 పార్టీల కూటమి ఆయనకు మద్దతుగా నిలిచింది. 550 మంది అసెంబ్లీ
సభ్యుల్లో 518 మంది, 332 మంది ఎంపీల్లో 313 మంది ఓటుహక్కు
వినియోగించుకున్నారని ఎన్నికల అధికారులు తెలిపారు. ఎమ్మెల్యేల్లో 352 మంది,
ఎంపీల్లో 214 మంది పౌడెల్‌కు ఓటు వేశారు. మాజీ ప్రధాని కె.పి.శర్మ
నేతృత్వంలోని సీపీఎన్-యూఎంఎల్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన సుభాష్ చంద్ర
నెబ్‌మాంగ్ ఓడిపోయారు. ప్రస్తుత అధ్యక్షురాలు బిద్యాదేవీ భండారీ పదవీకాలం ఈ
నెల 12తో ముగియనుంది. రాజకీయ అస్థిరత నెలకొన్న వేళ అధ్యక్ష ఎన్నికలు ప్రధాని
ప్రచండ ప్రభుత్వ భవిష్యత్తును నిర్దేశించనున్నాయి. 2008లో గణతంత్ర దేశంగా
అవతరించిన తర్వాత నేపాల్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇది మూడోసారి. 78 ఏళ్ల
పౌడెల్‌ను నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్బా అభినందిస్తూ
ట్వీట్ చేశారు. ప్రధాని ప్రచండ నేతృత్వంలోని ప్రభుత్వ సుస్థిరతకు నూతన
అధ్యక్షుని ఎన్నిక మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు. మధ్యతరగతి రైతు
కుటుంబంలో పుట్టిన పౌడెల్.. 16 ఏళ్ల వయసులో విద్యార్థి దశలోనే రాజకీయాల్లో
ప్రవేశించారు. ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ అంచెలంచెలుగా ఎదిగారు.